iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. వారి కోసం కీలక నిర్ణయం

  • Published Apr 21, 2024 | 12:02 PM Updated Updated Apr 21, 2024 | 12:02 PM

ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సెలవు తేదీలు ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం తాజాగా విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే సెలవు తేదీలు ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం తాజాగా విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Apr 21, 2024 | 12:02 PMUpdated Apr 21, 2024 | 12:02 PM
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. వారి కోసం కీలక నిర్ణయం

వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడెప్పుడు ఆడుకుందామా? అని విద్యార్థులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం సరికొత్త ప్రోగ్రాంని డిజైన్ చేసింది. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఏపీ విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రాంకి సంబంధించి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ.

‘సెలవుల్లో సరదాగా 2024’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది విద్యాశాఖ. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలకు విద్యాశాఖ సూచించింది. దాంతో పాటు విద్యార్థుల్లో పుస్తకాలు చదవడంలో ఆసక్తిని పెంచేలా ‘వుయ్ లవ్ రీడింగ్’ పేరిట పోటీలు నిర్వహించాలని టీచర్లు, హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు టీచర్లు ప్రయత్నించాలని విద్యాశాఖ సూచించింది. ‘సెలవుల్లో సరదాగా 2024’ కార్యక్రమం అమలుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు.

ఈ కాన్ఫిరెన్స్ లో ‘సెలవుల్లో సరదాగా 2024’ కార్యక్రమంలో భాగంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న స్కిల్స్ తో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం, క్రియేటివిటీ వంటి వాటిపై ఫోకస్ చేయాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. స్వచ్చంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. మరి వేసవి సెలవుల్లో విద్యార్థులకు చదవడంపై ఆసక్తి కలిగించేలా పోటీలు నిర్వహించాలని.. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని ఏపీ ప్రభుత్వం ‘‘సెలవుల్లో సరదాగా 2024’ కార్యక్రమాన్ని రూపొందించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.