ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించబడ్డ డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి ఎవరు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2004-2014 వరకు యు.పి.ఏ ప్రభుత్వ ఆరోగ్య సలహాదారుడిగా విశేష సేవలదించిన డాక్టర్ కొల్లి శ్రీనాధ్ రెడ్డీ ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో రెండు రోజులో శ్రీనాధ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ని కలిసి భాద్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది.

డాక్టర్ కొల్లి శ్రీనాధ్ రెడ్డి 1973లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ పట్టా పుచ్చుకున్నారు, విప్లవ నిప్పు కణిక జార్జ్ రెడ్డికి ఉస్మానియాలో కె.శ్రీనాధ్ రెడ్డి ఆప్త మిత్రుడు. శ్రీనాధ్ రెడ్డి తండ్రి మాజీ కేంద్ర మంత్రి కె.వి.రఘునాథరెడ్డి ప్రభావం జార్జ్ రెడ్డి మీద ఉండేది,వీరిని అప్పట్లో కాంగ్రెస్ సోషలిస్టు గ్రూప్ గా వ్యవహరించేవారు. శ్రీనాధ్ రెడ్డీ 1977లో AIMS లో MD గా, 1980లో అదే యూనివర్సిటీ నుండి కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో DM చేశారు, ఆ తరువాత క్లినికల్ ఎపిడిమాలజీ లో కెనడా లో ఎం.ఎస్.సి చేశారు.

Also Read:-నిఖార్సైన ఎన్నికల అంచనాలు ఇచ్చిన CPS వేణుగోపాల రావు మృతి

1989లో నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెంబర్ మొదలుపెట్టిన ఆయన ప్రయాణం, ఆల్ ఇండీయా మెడీకల్ సైన్స్ లో కార్డీయాలజీ ప్రొఫెసర్ గా , ప్రపంచ ఆరొగ్య సంస్థ ఏడ్వైజరీ ప్యానల్ లో మెంబర్ గా, నేష్నల్ హ్యుమన్ రైట్స్ కనీషన్ లో ప్రజా ఆరోగ్యం మరియు మానవ హక్కుల అడ్వైజరీ గ్రూప్ కి కన్వీనర్ గా , నేషనల్ మెడికల్ జర్నల్ కి ఎడిటర్ గా, ప్రపంచ గుండెజబ్బుల నిపుణుల సమాఖ్య అధ్యక్షుడు, ఇలా అనేక స్థాయిల్లో ఆయన ప్రపంచ ప్రజా ఆరోగ్యానికి సేవలు అందించారు. 2009లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కి ముంబై బీచ్ క్యాండీ హాస్పిటల్లో గుండె బైపాస్ సర్జరీ చేసినన డాక్టర్ బృందంలో శ్రీనాధ్ రెడ్డీ గారు కూడా ఒకరు. అలాగే శ్రీనాథ్ రెడ్డి పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు.

ప్రజా ఆరోగ్యం పై డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి చేసిన సేవలకు గాను ఆయనకి పలు అవార్డులు లభించయి, పొగాకు వాడకం నియంత్రణలో చేసిన కృషికి గాను ఆయనకు ప్రపపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అవార్డు లభించింది. ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యు.కె. యొక్క ఫెలోషిప్, లాసన్నే విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, దీంతో పాటు 2005లో పద్మ భూషన్ , అదే ఏడు క్వీన్ ఎలిజిబెత్ మెడల్ , అమెరికన్ కాన్సర్ సొసైటి ద్వారా లూథర్ టెర్రీ మెడల్, వీటితో పాటు డాక్టర్ ఆఫ్ సైన్స్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అవార్డులు కూడా లభించాయి.

Also Read:-ఉద్యోగుల జీతాలు.. ఎక్కడా కోతలు లేవు,విడతల వారీగా చెల్లింపు …

డాక్టర్ కొల్లి శ్రీనాధ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి కుమారుడు.నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరిపూరు గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి సోషలిస్ట్ సిద్దాంతాన్ని పూర్తిగా అవపోసనం పట్టినవారు, స్వతంత్ర రాజ్యసభ సభ్యుడిగా డిల్లీ రాజకీయల్లో అడుగుపెట్టిన ఆయన్ను ఇందిరా గాంధి తన మంత్రి వర్గంలో కార్మిక మంత్రిని చేశారు. 1971 ఎన్నికల్లో ఇందిరమ్మ గరీభి హటావో నినాదం వెనుక రఘునాథ్ రెడ్డి ఆలోచన ఉందని చెబుతారు.

రఘునాథ్ రెడ్డి 1962-1980 మధ్య 18 సంవత్సరాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.పేద ప్రజల అభ్యున్నతికి ఎటువంటి ఆర్ధిక విధానాలు అనుసరించాలొ ఆచరనాత్మకంగా చెప్పడంలో సిద్దహస్తుడు రఘునాధ్ రెడ్డి, అందుకే బెంగాల్ ముఖ్యమంత్రి జ్యొతి బసు ఆయనను గవర్నర్ గా కోరి మరీ నియమించుకున్నారు. అలాగే ఆయన త్రిపుర, ఒడిస్సా రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా సేవలు అందించారు.

శ్రీనాథ్ రెడ్డి తల్లి సరోజిని గారు కూడా డాక్టర్. ఆవిడ ఆసుపత్రిలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పుట్టారు.

ఇలా వైద్య రంగంలో ఎంతో అనుభవాన్ని గడించిన, ముఖ్యంగా ప్రజా ఆరోగ్యరంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రజా ఆరోగ్య సలహా దారుడి నియమించడం దానికి శ్రీనాధ్ రెడ్డి ఎలాంటి పారితోషకం లేకుండానే సేవలు అందిస్తానని చెప్పడం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ అవ్వడం చెప్పుకోదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో సత్ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Show comments