iDreamPost
iDreamPost
ఏపీలో ఇవాళ(జూన్ 6) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అవ్వనున్నాయి. జూన్ 4 శనివారం రోజున పదవ తరగతి పరీక్షా ఫలితాలని విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అధికారులు, మంత్రి, సిఎంవోల సమన్వయ లోపంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. దీంతో ఫలితాలని సోమవారం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఇవాళ(జూన్ 6) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేయనున్నారు. గత కొన్నేళ్లుగా గ్రేడ్ల రూపంలో ఫలితాలు ఇస్తున్నారు. అయితే ఈ సారి ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని తెలిపారు.
కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ సంవత్సరం పరీక్షలు పెట్టి ఫలితాలని విడుదల చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.results.bse.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.