iDreamPost
android-app
ios-app

Crime News యాంటీ రోమియో స్క్వాడ్ లో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం

  • Published May 11, 2022 | 5:02 PM Updated Updated May 11, 2022 | 6:39 PM
  • Published May 11, 2022 | 5:02 PMUpdated May 11, 2022 | 6:39 PM
Crime News యాంటీ రోమియో స్క్వాడ్ లో మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం

అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ‌క‌ల్పించే యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ పై, మరో స్టేషన్ ఇన్ స్పెక్టర్ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని బాందాలో కేసు న‌మోదైంది. త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని మహిళా కానిస్టేబుల్, గిర్వాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

గిర్వాన్ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ పై బాబేరు పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ లైంగికదాడి చేశాడు. ఆమె బైట‌కు చెబుతాదేమోన‌న్న భ‌యంతో పెళ్లి చేసుకుంటానని న‌మ్మ‌బ‌లికాడు. ప్రాధేయ‌ప‌డ్డాడు. అందుకే మహిళా కానిస్టేబుల్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. పెళ్లి చేసుకుంటానన్న పేరుతో తనపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు తెలిపింది. ఫిబ్రవరి 21న ఆ ఎస్సై మరొక మహిళను రహస్యంగా వివాహం చేసు ఫిబ్రవరి 28న ఆమె ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా, ఇన్ స్పెక్టర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఆమె చెప్పిందంతా నిజ‌మ‌ని దర్యాప్తులో తేలింది.

సుమారు రెండున్నర నెలలు తర్వాత నిందితుడు మే 9వ తేదీ, సోమవారం కోర్టుకు లొంగిపోయాడు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కేసు విచార‌ణ‌లో ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom