iDreamPost
android-app
ios-app

సినీపరిశ్రమలో మరో విషాదం- సంచలన దర్శకుడు మృతి

సినీపరిశ్రమలో మరో విషాదం- సంచలన దర్శకుడు మృతి

ఈ 2020వ సంవత్సరంలో సినిమా ఇండ‌స్ట్రీలో ఊహించని విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కాన్సర్ తో పోరాడి, క‌న్న‌డ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో ఆక‌స్మాత్తుగా మృతి చెందగా..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయం సాధించి ప్రసంశలు దక్కించుకున్న మళయాళ చిత్రం అయ్యప్పనమ్ కోషియమ్ దర్శకుడు ఆర్​ సచిదానంద‍న్ మృతి చెందడంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలతుంటి మార్పిడి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం ఆయనకు కార్డియక్ అరెస్ట్ కావడంతో హాస్పిటల్ కి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. మృత్యువుతో పోరాడి గురువారం రాత్రి మృతి చెందడం సినీ వర్గాలను కలచి వేసింది.

ఇటీవల ఆర్​ సచిదానంద‍న్ రూపొందించిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్ చిత్రం సంచలన విజయం సాధించింది. మ‌ల‌యాళ‌ స్టార్​ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ నటించిన ఈ చిత్రం కేవలం 5 కోట్ల బడ్జెట్ తో రూపొంది 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet