ఇటీవల కొంతకాలం నుంచి తిరుమలలో చిరుతలు హల్ చల్ చేస్తోన్నాయి. కొద్ది నెలల క్రితం లక్షిత అనే బాలిక చిరుత దాడికి బలైంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక చర్యలు తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, భయాందోళనలు లేకుండా చర్యలు చేపట్టింది. బాలికపై దాడి జరిగిన సమయంలో చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులు టీటీడీ భరోసా కల్పించారు. అయితే తాజాగా తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుతల కోసం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది
గతకొంతకాలం నుంచి తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తులు వన్యమృగాల భయంతో ఉన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చిరుత, ఎలుగుబంటి వంటి వన్యమృగాలను పట్టుకునేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసంచారం ప్రాంతంలో, ముఖ్యంగా తిరుమలకు నడకదారిలో వెళ్లే ప్రాంతంలో బోనులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారు జామున మరో చిరుత బోనులో పట్టుబడింది.
కాగా నడక మార్గంలో వారం రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించారు. అయితే చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా ఈ చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్ కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల ప్రాంతంలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. మరి.. వన్యమృగాలను అరికట్టడంలో టీటీడీ తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.