iDreamPost
android-app
ios-app

F3 షూటింగ్స్‌లో అనిల్ రావిపూడితో తమన్నా గొడవ.. అందుకే ప్రమోషన్స్‌కి రాలేదా??

  • Published Jun 06, 2022 | 8:00 PM Updated Updated Jun 06, 2022 | 8:00 PM
  • Published Jun 06, 2022 | 8:00 PMUpdated Jun 06, 2022 | 8:00 PM
F3 షూటింగ్స్‌లో అనిల్ రావిపూడితో తమన్నా గొడవ.. అందుకే ప్రమోషన్స్‌కి రాలేదా??

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా F3. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి అందర్నీ నవ్విస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయి హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది F3 సినిమా. దీంతో సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత కూడా చిత్ర యూనిట్ మళ్ళీ సక్సెస్ మీట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్.. ఇలా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

అయితే సినిమా రిలీజ్ కి ముందు కానీ, రిలీజ్ తర్వాత కానీ ప్రమోషన్స్ లో తమన్నా ఎక్కువగా కనిపించలేదు. అలాగే F3 సినిమా షూటింగ్ సమయంలో తమన్నాకి, అనిల్ రావిపూడి మధ్య గొడవ జరిగినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి దీని గురించి మాట్లాడారు.

అనిల్ రావిపూడి తమన్నాతో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ.. ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు అప్పుడప్పుడు చిన్నచిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. తమన్నాతో జరిగింది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్‌ కొంచెం లేట్ అయింది. అప్పటికి షూటింగ్ ఇంకా అవ్వక ఆర్టిస్టులని వెయిట్ చేయించాల్సి వచ్చింది. దానికి తమన్నా వచ్చి ఇంత లేట్ అయితే ఎలా పొద్దున్నే జిమ్‌ చేసుకోవాలి, టైం లేదు, నేను వెళ్ళిపోతాను అని మాట్లాడింది. దానికి నేను సీరియస్ అయ్యాను. ఇలా రెండు మూడు రోజులు మా మధ్య గొడవలాగా జరిగింది. కానీ ఆ తర్వాత అంతా మామూలు అయిపొయింది. ఇక ప్రమోషన్స్ కి వేరే సినిమాల షూటింగ్స్ ఉండటం వల్ల రాలేకపోయింది అని తెలిపాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş