iDreamPost
android-app
ios-app

వైజాగ్ బీచ్ మిస్సింగ్ కేసులో వివాహిత బిగ్ ట్విస్ట్! గాలింపుకు కోటి ఖ‌ర్చు

  • Published Jul 27, 2022 | 3:52 PM Updated Updated Jul 27, 2022 | 3:53 PM
  • Published Jul 27, 2022 | 3:52 PMUpdated Jul 27, 2022 | 3:53 PM
వైజాగ్ బీచ్ మిస్సింగ్ కేసులో వివాహిత బిగ్ ట్విస్ట్! గాలింపుకు కోటి ఖ‌ర్చు

విశాఖ ఆర్కే బీచ్‌లో పెళ్లి రోజున మిస్సింగ్ కేసులో క‌నిపించ‌కుండా పోయిన వివాహిత చిరిగిడి సాయి ప్రియ వ్య‌వ‌హారంలో అనూహ్య‌మైన మ‌లుపు తిరిగింది. స‌ముద్రంలో గ‌ల్లంతు అయ్యింద‌ని, ఆమె ఆచూకీ కోసం రెండు రోజులుగా హెలికాప్ట‌ర్ తో వెతుకుతున్నారు. తీరా చూస్తే ఆమె నెల్లూరులో ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ ఓ యువ‌కుడితో ప్రియ ఉన్న‌ట్లు పోలీసులు క‌నిపెట్టారు. అత‌ను ఎవ‌రు? ప‌్రియుడా? పోలీసులు ఇంకా నిర్ధారించ‌లేదు.

రెండురోజుల క్రితం సాయిప్రియ పెళ్లి రోజున‌ భ‌ర్త‌తో క‌లిసి విశాఖ ఆర్కే బీచ్‌కి వెళ్లింది. ఫోటోలు దిగుతోంది. రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త ఫోన్ చూసుకొంటుండ‌గా, సాయిప్రియ అదృశ్య‌మైంది. సెల్ఫీ తీసుకుంటుండ‌గా, సాయిప్రియ స‌ముద్రంలో కొట్టుకుపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు.

భ‌ర్త చుట్టుప‌క్క‌ల వెతికాడు. ఆమె క‌నిపించ‌లేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే స్పందించిన‌ మెరైన్‌, నేవీ, ఏపీ పోలీసులు ఆమె కోసం గాలించారు.

రెండురోజులుగా స్పీడ్ బోట్లు, హెలికాప్టర్ల‌తో గాలిస్తున్నారు. ఇందుకోసం కోటి రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యాయి. ఎంత‌కీ ఆచూకీ దొర‌క్క‌పోవ‌డంతో ప్రియ గ‌ల్లంతే అయిందా? కుటుంబ స‌భ్యులు భ‌య‌ప‌డ్డారు.

ఈ స‌మ‌యంలో, సాయిప్రియ అదృశ్యంపై షాకింగ్ వార్త‌. సాయిప్రియ చీక‌ట్లో అదునుచూసి, భ‌ర్త‌కు తెలియ‌కుండా నెల్లూరు జిల్లాలోని ప్రియుడి ద‌గ్గ‌రికి వెళ్లింద‌నే ప్ర‌చారం బైట‌కొచ్చింది. కాని పోలీసులు, కుటుంబ స‌భ్యులు ఇంకా నిర్ధారించ‌లేదు.

సాయిప్రియ‌కు భ‌ర్త‌ శ్రీనివాసరావుకు మ‌ధ్య గొడ‌వ‌ల‌ని అంటున్నారు. ప్రియ విశాఖ ఎన్ఏడి ద‌గ్గ‌ర సంజీవయ్య‌న‌గ‌ర్ లో ఉంటుంటే, భ‌ర్తది హైద‌రాబాద్ లో ఉద్యోగం. పెళ్లిరోజుకాబ‌ట్టి ఇద్ద‌రూ క‌ల‌సి బీచ్ కెళ్లారు. ఈ లోగా కాల్ రావ‌డంతో శ్రీనివాస‌రావు ప‌క్క‌కెళ్లి మాట్లాడాడు. తిరిగి చూస్తే భార్య లేదు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వాళ్లు గాలింపు మొద‌లుపెట్టారు. చివ‌రి ఆమె ఆచూకీ నెల్లూరులో దొరికింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet