iDreamPost
android-app
ios-app

జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై… కొత్తగా రాబోతోంది ఆ యాంకరేనా?

జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై…  కొత్తగా రాబోతోంది ఆ యాంకరేనా?

ప్రత్యేకించి పరిచయం అవసరమే లేనంతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ అనే షోతో చిన్న, పెద్దా తేడా లేకుండా పాపులారింటీ సంపాదించింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే జబర్దస్త్ షోకు యాంకర్ గా కొసాగుతూ వచ్చింది. తాజాగా జబర్దస్త్ షోకు అనుసూయ టాటా చెప్పడంతో ఇప్పుడు కొత్త యాంకర్ ఎవరా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అనసూయ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు షోకు సంబంధించిన యాజమాన్యం సైతం కొత్త యాంకర్ కోసం చాలానే కసరత్తులు చేసింది. చివరకు మరో బ్యూటీని యాంకర్ గా ఖరారు చేస్తూ సరికొత్త ప్రోమోను సైతం విడుదల చేసింది.

తాజా ప్రోమోలో.. ఆ యాంకర్ ను పల్లకిలో తీసకొచ్చి మరీ స్వాగతం చెప్పారు. కానీ ఈ ప్రోమోలో ఆమె ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఇప్పుడు ఆ యాంకర్ ఎవరు అనే అంశం జబర్దస్త్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. కొంతమంది యాంకర్ రష్మీనే ఇందులోనూ కొనసాగిస్తారని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ యాంకర్ మంజూషా అన అంటున్నారు. మరి జబర్దస్త్ షోకు కొత్తగా వస్తున్న యాంకర్ ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే!!

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş