Anasuya Bharadwaj ఆంటీ అన్న ట్రోలింగ్ పై అన‌సూయ పోలీస్ కేసు

త‌న‌ను ఏజ్ షేమ్ చేస్తూ, ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసులు పెడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ అంతప‌ని చేసింది. సోషల్‌ మీడియాలో అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తూ, కొందరు అసభ్యకర రీతిలో కామెంట్స్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. అయినా కొంద‌రు నెటిజన్లు ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేశారు. ఆమెను ఆన్ లైన్ లో ఇబ్బందిపెట్టారు. ఆమె వ‌ద్ద‌న్న‌కొద్దీ ట్వీట్స్ చేశారు. ఆంటీ అన్న హ్యాష్ ట్యాగ్ ను జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు.

తనను ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘ ప్రొసెస్ మొద‌లైంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, చేయాల్సింది చేయ‌క‌త‌ప్ప‌దు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. అప్‌డేట్స్‌ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది’ అంటూ కంప్లైట్‌ స్క్రీన్‌షాట్‌ని షేర్‌ చేసింది అనసూయ‌.


‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!’ అని అంటూ ఈనెల 25న అనసూయ ట్వీట్‌ చేసింది. అదే రోజు లైగ‌ర్ సినిమా రిలీజ్. ఫ‌స్ట్ షోతోనే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. ఇది హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించే పెట్టిందన్న విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు ఆంటీ అంటూ అనసూయను ట్రోల్ చేశారు. స్టాప్ ఆన్ లైన్ అబ్యూజ్ అంటూ అన‌సూయ చెబుతున్నా ఆమెను రెచ్చ‌గొట్టారు. ఆమె ఏజ్ ను, బాడీని ట్రోల్ చేశారు. ఈ ర‌గ‌డ చివ‌రకు పోలీసు కేసు వ‌ర‌కు వెళ్లింది.

Show comments