iDreamPost
android-app
ios-app

జబర్ధస్త్ లోకి జవాన్ బ్యూటీ.. ఇక సందడే సందడి!

  • Published Nov 06, 2023 | 2:20 PM Updated Updated Nov 06, 2023 | 2:20 PM

తెలుగు బుల్లితెరపై ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా.. వాటిలో జబర్ధస్త్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్ధస్ తో ఎంతోమంది కమెడిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.

తెలుగు బుల్లితెరపై ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా.. వాటిలో జబర్ధస్త్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్ధస్ తో ఎంతోమంది కమెడిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.

  • Published Nov 06, 2023 | 2:20 PMUpdated Nov 06, 2023 | 2:20 PM
జబర్ధస్త్ లోకి జవాన్ బ్యూటీ.. ఇక సందడే సందడి!

తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. గత కొన్నేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తొలుత జబర్దస్త్ రాగా, ఆ షో సక్సెస్ కావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్‌ను తీసుకువచ్చారు ప్రోగ్రామ్ క్రియేటర్స్. గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న ఈ షోను మిస్ కాకుండా చూస్తుంటారు చాలా మంది. ఈ షో ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపింది. ఈ కార్యక్రమం నుండి వచ్చిన నటీనటులు బుల్లితెరపైనే కాదూ వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాగే జబర్దస్త్ మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు పలువురు టీమ్ లీడర్స్, జడ్జస్ మారినప్పటికీ.. యాంకర్లు మాత్రం మారింది తక్కువే.

నటి అనసూయ.. ఈ షో ద్వారానే పాపులర్ అయ్యింది. జబర్దస్త్ మొదలైన నాటి నుండి ఆమె యాంకర్‌గా వ్యహరించారు. కేవలం ఆరు నెలల్లోనే యాంకర్ అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె ఇతర షోస్, వెండితెరపై ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. ఆ సమయంలో అనసూయ స్థానంలో రష్మిని తీసుకువచ్చారు. రష్మి తన అందచందాలతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.  ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు రష్మి వ్యాఖ్యాతగా ఉంది. జబర్దస్త్‌తో అనసూయకు నటిగా అవకాశాలు పెరగడంతో.. ఈ షో నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేసులోకి సీరియల్స్ నటి సౌమ్య రావ్.. వచ్చి చేరింది.

ఇక ఈ అమ్మడు వచ్చిరాని తెలుగులో మాట్లాడినప్పటికీ.. ఆమె యాంకరింగ్ ఫిదా అయ్యారు టీవీ ప్రేక్షకులు. కానీ ఏమైందో ఏమో తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కొత్త యాంకర్ అంటూ సిరి హన్మంతును తీసుకువచ్చారు.  సౌమ్య స్థానంలోకి సిరిని చూసి షాక్ అయ్యారు వీక్షకులు. ఏం జరిగి ఉంటుందబ్బా అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరీ సిరినే ఈ షో కొత్త యాంకర్.. లేక టెంపరరీగా వచ్చిందో వేచి చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్‌లో తెల్లటి గౌనులో మెరిసిపోతుంది ఈ పిల్ల. మరీ ఈ బ్యూటీ ఎంత వరకు అలరిస్తోందో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet