iDreamPost
android-app
ios-app

Anasuya: క‌న్యాశుల్కం వెబ్‌ సిరీస్‌లో మ‌ధుర‌వాణిగా అనసూయ ?

  • Published Jul 03, 2022 | 6:11 PM Updated Updated Jul 03, 2022 | 6:13 PM
  • Published Jul 03, 2022 | 6:11 PMUpdated Jul 03, 2022 | 6:13 PM
Anasuya: క‌న్యాశుల్కం వెబ్‌ సిరీస్‌లో మ‌ధుర‌వాణిగా అనసూయ ?

జ‌బ‌ర్ద‌స్ స్కిట్స్ జోకుల‌కు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే అన‌సూయ‌కాదు ఇప్పుడుంది. యాక్టింగ్ ను ఛాలెంజ్ తీసుకొని కొత్త పాత్ర‌ల‌కు సిద్ధ‌మైన ఆర్టిస్ అన‌సూయ. ఇంకా అంద‌రూ ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప: ది రైజ్​’లో దాక్షాయణినే అన‌సూయ‌ను గుర్తుపెట్టుకొంటున్నారు. నిజానికి ఆమె కొత్త పాత్ర‌లను డేరింగ్ గా ఒప్పుకొంటోంది. ఆమె లేటెస్ట్ గా చిరంజీవి ‘గాడ్ ఫాదర్‌’ చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్‌లో రెడీ. ఇవ‌న్నీ ఒకెత్త‌, వెబ్ సీరీస్ లో త‌నకంటూ ఓ పేరుకోసం చాలెంజింగ్ పాత్ర‌లో అనసూయ నటించనున్నారు.

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాట‌కం ఎవ‌ర్ గ్రీన్. మ‌నుషుల మ‌న‌స్త‌త్త్వాలు, ఎమోష‌న్స్ మీద వేసిన గొప్ప సెటైర్. ప్ర‌తి పాత్ర చుట్టుప్ర‌క్క‌ల వారిలో క‌నిపిస్తూనే ఉంటుంది. ఇక మ‌ధుర‌వాణి అంటారా? మ‌నుషుల‌నే కాదు, క‌థ‌నే మలుపుతిప్పిన కీల‌క పాత్రధారి. ఇప్పుడు మ‌ధుర‌వాణి పాత్ర‌కోస‌మే అన‌సూయ‌ను డైరెక్ట‌ర్ క్రిష్ సంప్ర‌దించారంట‌.

క‌న్యాశుల్కం క‌థ‌తో క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నాడట. కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ ఆయ‌న‌వే. కాని డైరెక్ట‌ర్ మాత్రం కొత్త కుర్రాడు.

క‌న్యాశుల్కంలో కీల‌క పాత్ర అయిన మ‌ధుర‌వాణి కేర‌క్ట‌ర్ ను అనసూయ చేయ‌నున్న‌ట్లు సమాచారం. ఆ పాత్ర విలువేంటే ఆమెకు బాగానే తెలుసు. పేరుకే వేశ్య అయినా గొప్ప ఉదాత్త‌మైన పాత్ర మ‌ధుర‌వాణిది. అనుసూయ లాంటి టాలెంటెడ్ క‌నుక ఆ పాత్ర‌ను పోషిస్తే, ఆ రేంజే వేరు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet