iDreamPost
android-app
ios-app

ప్రసిద్ధ ‘అమూల్‌ బేబి’ కార్టూన్‌ సృష్టికర్త కన్నుమూత!

ప్రసిద్ధ ‘అమూల్‌ బేబి’ కార్టూన్‌ సృష్టికర్త కన్నుమూత!

అమూల్.. ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.  పాడి ఉత్పత్తులో అమూల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అమూల్ పేరు చెప్పగానే మనకు వెంటనే గౌను వేసుకున్న ఓ బేబి కార్టున్ గుర్తుకు వస్తుంది. తన వినియోదారులు గుర్తుండిపోయేలా అమూల్ బ్రాండ్ తనదైన శైలిలో  అమూల్ గర్ల్ కార్టున్లను రూపొందిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంఘటనలను హాస్య రూపంగా, గుర్తుండిపోయేలా వారు కార్టూన్లను రూపొందిస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ‘అమూల్‌ బేబి’ డాచున్హా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ సిల్వెస్టర్‌ డాచున్హా(80) రూపొందించారు. గురువారం ఆయన కన్నుమూశారు.

1966లో తొలిసారిగా ‘అట్టర్లీ-బటర్లీ’ ప్రచారంతో ఆయన అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ ను రూపొందించారు. అప్పట్లో ఆ కార్టూన్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్ లో కనిపించే పాపాయి కారణంగా అమూల్ బ్రాండ్ కు గుర్తింపు వచ్చింది. అదే ప్రపంచ వ్యాప్తంగా అమూల్ గర్ల కంపెనీ విజయవంతగా కొనసాగేందుకు తోడ్పడుతోంది. ఆ కార్టూనే అమూల్ ఉత్పత్తులన అమ్మకాన్ని భారీగా పెంచిందంటే అతిశయోక్తి కాదు. అట్టర్లీ-బటర్లీ ప్రచారంతో ఈ కార్టూన్‌కు ఎంతో పేరు వచ్చింది. ముంబయిలో డాచున్హా మృతిచెందినట్లు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయేన్‌ మెహ్‌తా డాచున్హా తెలిపారు.

ఆయన మృతి విషయాన్ని మెహతా డాచున్హా.. తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. డాచున్హా మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.  కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేష్‌ సంతాపం ప్రకటించారు. డాచున్హా టాలెంట్ ను అమూల్‌ సృష్టికర్త వర్గియస్ కురియన్‌ గుర్తించి ప్రోత్సహించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. డాచున్హా అడ్వర్టైజ్‌మెంట్‌ లెజెండ్‌  అంటూ ఆయన పేర్కొన్నారు. మరి.. అమూల్ గర్ల్ రూపకర్త మృతికి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.