iDreamPost
iDreamPost
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార కేసులో రోజుకో కొత్త సంచలన విషయాలు బైటకొస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్‌తో కీలక విషయాలు తెలుస్తున్నాయి.
సామూహిక అత్యాచారం చేశారు. ఇంతకీ, ఆమెను మొదట ట్రాప్ చేసింది ఎవరు? ఎవరు బెదిరించారు? అత్యాచారానికి ఎవరు ప్రోత్సహించారు? ఈ కీలక ప్రశ్నకు నిందుతులు సమాధానమిచ్చారు. కార్పొరేటర్ కుమారుడే బాధితురాలిని ట్రాప్ చేశాడనడి నిందితులు చెప్పారు. పబ్‌లో ఆ అమ్మాయితో కార్పొరేటర్ కొడుకు మితిమీరి ప్రవర్తించాడు. పబ్ బయటకు వచ్చాక కార్పొరేటర్ కొడుకే ఆమె దగ్గరకెళ్లి, ట్రాప్ చేశాడు. ఆ తర్వాతే ఆమెను కారులో ఎక్కించాడన్నది నిందితుల వివరణ.
మరి కారులో ఏమైంది? బెంజ్ కారులో ఎమ్మెల్యే కుమారుడు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ అతర్వత కార్పొరేటర్ కొడుకు వంతు. ఆతర్వాత ముందు సీట్లో నుంచి సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడు. బాధితురాలిపై లైంగిక దాడి చేశాడు. కాన్సూ బేకరీ దగ్గర బాధితురాలిని కార్‌లోనే కూర్చోబెట్టామని నిందుతులు చెప్పారు.
బేకరీలో అందరూ తిన్నాం, సిగరెట్లు తాగాం. అక్కడి నుంచి ఇన్నోవాలో పబ్‌కి బయల్దేరాం. బాధితురాలి సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కున్నాం. ఆమె గాగుల్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి. అవి కావాలంటే ఇన్నోవా ఎక్కాలని బెదిరించాం. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేశామని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాల సమాచారం.
అమ్నీషియా పబ్ రేప్ కేసులో జువనైల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్టు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి దొరికినట్లే ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తున్నారు. ఐదుగురిని కలిపి రేపటి నుంచి విచారిస్తారు.