iDreamPost
android-app
ios-app

Amnesia Pub Case: కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన సాదుద్దీన్.. సూత్రధారి కార్పొరేటర్ కొడుకే

  • Published Jun 13, 2022 | 5:27 PM Updated Updated Jun 13, 2022 | 5:27 PM
Amnesia Pub Case: కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన సాదుద్దీన్.. సూత్రధారి కార్పొరేటర్ కొడుకే

జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్.. మూడ్రోజుల పోలీసుల కస్టడీలో కీలక విషయాలను వెల్లడించాడు. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కొడుకే అసలు సూత్రధారి అని, ఎమ్మెల్యే కొడుకు – కార్పొరేటర్ కొడుకే మొత్తం ఘటనకు కారణమని సాదుద్దీన్ తెలిపాడు. వాళ్లిద్దరూ అమ్నీషియా పబ్ లోకి రాగానే అమ్మాయిల కోసం వెతికారని.. పబ్ లో మైనర్ అమ్మాయిలను వేధించారని పేర్కొన్నాడు. ఆ పబ్ నుంచి బయటికి వచ్చిన ఇద్దరూ ఒక మైనర్ వెంట పడగా.. వద్దని తాను ఎంత వారించినా వినలేదన్నాడు. తనను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించి, పబ్ వద్ద వదిలి అక్కడ ఒక అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడని తెలిపాడు.

“నేను బెంజ్‌ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఎమ్మెల్యే కుమారుడు వేధించడం మొదలుపెట్టాడు. మార్గంమధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్‌ బలవంతం కారణంగానే నేనూ లైంగికదాడి చేయాల్సి వచ్చింది.” అని సాదుద్దీన్‌ పోలీసుల ముందు తెలిపాడు. సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో.. శాస్త్రీపురం కార్పొరేటర్‌ కుమారుడు కీలక సూత్రధారి అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

ఆ తర్వాత సాదుద్దీన్‌, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు, సంగారెడ్డి కార్పొరేటర్‌ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉ‍న్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. జువైనల్ హోం లో ఉన్న ఐదుగురు నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. సాదుద్దీన్ మూడ్రోజుల పోలీసు కస్టడీ పూర్తవ్వడంతో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.