iDreamPost
android-app
ios-app

కెప్టెన్ అమ్మ రాజశేఖర్ – రంగులు శిక్షలు అరుపులు

  • Published Nov 07, 2020 | 6:43 AM Updated Updated Nov 07, 2020 | 6:43 AM
కెప్టెన్ అమ్మ రాజశేఖర్ – రంగులు శిక్షలు అరుపులు

బిగ్ బాస్ 4కు మరో వీకెండ్ వచ్చేసింది. ఇవాళ నాగార్జున ఎవరిని బయటికి పంపబోతున్నారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. అతి హద్దులు దాటుతున్నప్పటికీ సభ్యులు మాత్రం ఓవర్ యాక్షన్ మానుకోవడం లేదు. సోషల్ మీడియాలోనూ ఈ శైలి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకులకు వెగటు పుట్టించేలా ఈ మధ్య కొన్ని టాస్కులు జరగడం కూడా కొంత మైనస్ గా నిలుస్తోంది. ఇక నిన్న చివరి రోజు కాబట్టి హౌస్ మేట్స్ ఎవరికి వారు మంచి కళాపోషణ చేశారు. అభిజిత్ లాస్యలు వంట చేస్తుండగా అక్కడ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం పట్ల కెప్టెన్ అరియనా గట్టిగానే ఫైర్ అయ్యింది. దీనికి అభిజిత్ కూడా ధీటుగానే బదులిచ్చాడు. దీంతో ఓదార్పు కోసం అమ్మ రాజశేఖర్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది అరియనా.

ఇక టాస్కుల సంగతి చూస్తే రింగులో రంగు ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం వైట్ టి షర్టుల మీద రంగులు పూయాల్సి ఉంటుంది. ఎవరైతే తక్కువ కలర్ తో మిగులుతారో వాళ్లే కెప్టెన్ అన్నమాట. హారిక అరియనా ఎంత ట్రై చేసినా ఫెయిలయ్యారు కానీ అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యి రివర్స్ లో వాళ్లకు రంగు కొట్టి కొత్త పదవి అందుకున్నాడు. వెంటనే అవినాష్ ని రేషన్ మేనేజర్ గా చేశాడు. తర్వాత నెయ్యితో క్యారెట్ హల్వా చేయించే వంట టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. లాస్య మోనాల్ ల మధ్య పోటీ జరిగింది. మధ్యలో అభిజిత్ ఎగతాళిగా కొంత డ్రామా చేసి మోనాల్ ని గేలి చేసినా ఫైనల్ గా ఇద్దరు బాగా చేశారని సర్టిఫికెట్ ఇచ్చారు మెంబర్స్.

ఇక అమ్మ కెప్టెన్ కావడంతో రచ్చ మాములుగా చేయలేదు. సోహైల్-అభిజిత్-అఖిల్ ముగ్గురికి మార్నింగ్ టిఫిన్ తో పాటు కిచెన్ క్లీన్ చేసే పనిని అప్పజెప్పాడు. మధ్యాహ్నం లంచ్ ని లాస్య, హారిక, మోనాల్ కలిసి చేయాలని ఫిక్స్ చేశాడు. ఉదయం బ్యాచే నైట్ డిన్నర్ కూడా చేయాలని ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లకు అసిస్టెంట్ గా అరియనా ఉంటుంది. ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళను గట్టిగా టార్గెట్ చేశాడు మాస్టర్.మెహబూబ్, అవినాష్ లకు బాత్ రూమ్ లు శుభ్రం చేసే మహత్కార్యాన్ని అప్పజెప్పగా డ్యూటీల విషయంలో అమ్మ రాజశేఖర్ తో బాగానే వాదోపవాదాలు చేశారు మిగిలినవాళ్లు. తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నందుకు కాసేపు శిక్షల ప్రహసనం సాగింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom