Puneeth Rajkumar : ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం ఇది

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి నెలలు గడుస్తున్నా ఇంకా అభిమానుల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాడు. ఇప్పటికీ సమాధి దగ్గరికి వచ్చి నివాళి అర్పిస్తున్న సంఖ్య రోజూ వేలల్లో ఉండటం గమనార్హం. చివరి చిత్రం జేమ్స్ విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నెల 26 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. పునీత్ డబ్బింగ్ చెప్పనప్పటికీ సెట్ లో రికార్డు చేసిన సింక్ సౌండ్ ని డిజిటల్ ప్రాసెస్ లో డెవలప్ చేసి వాడుకునే విధంగా టీమ్ ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే తన ఒరిజినల్ గొంతుతోనే జేమ్స్ సినిమాని చూడొచ్చు. థియేటర్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.

ఇదిలా ఉండగా అమెజాన్ ప్రైమ్ పునీత్ కి కొత్త తరహాలో నివాళి అందిస్తోంది. ఈ నటుడి ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతున్న మూడు కన్నడ సినిమాలను నేరుగా ఓటిటి ద్వారా ప్రేక్షకులకు అందించనుంది. అవి ఫ్యామిలీ ప్యాక్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్, వన్ కట్ టూ కట్. ఇంతే కాదు గతంలో ఇదే ప్లాట్ ఫార్మ్ పై పునీత్ నిర్మించిన ఐదు సినిమాలను ఫిబ్రవరి మొత్తం నెల రోజుల పాటు ఉచితంగా అందుబాటులో ఉంచనుంది. అంటే చందాదారులు కాకపోయినా సరే యుట్యూబ్ తరహాలో వీటిని ఫ్రీగా ఎవరైనా చూసుకోవచ్చు. అందులో గత ఏడాది పునీత్ నటించిన యువరత్న కూడా ఉంది. ఇప్పటిదాకా ప్రైమ్ ఇలా ఎవరికీ నివాళి అర్పించలేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఇది పునీత్ ఘనతగానే చెప్పుకోవచ్చు. చేసింది తక్కువ సినిమాలే అయినా జనం గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థ సైతం ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం చిన్న విషయం కాదు. భాషతో సంబంధం లేకుండా తన మరణం పట్ల కోట్లాది సినీ అభిమానులు కళ్లనీళ్లు పెట్టుకోవడం చూశాం. ఎక్కడెక్కడి సెలబ్రిటీలో వచ్చి అతని కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇచ్చారు. ఇక జేమ్స్ విషయానికి వస్తే పునీత్ పుట్టినరోజైన మార్చి 17న సినిమా విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. చూద్దాం

Also Read : Ala Vaikunthapurramloo : రంగంలోకి అల్లు అరవింద్ – రద్దుకు రాయబారం

Show comments