iDreamPost
android-app
ios-app

మీడియా ముసుగులో కించపరిచారు.. అందుకే..

  • Published Dec 30, 2019 | 3:10 PM Updated Updated Dec 30, 2019 | 3:10 PM
  • Published Dec 30, 2019 | 3:10 PMUpdated Dec 30, 2019 | 3:10 PM
మీడియా ముసుగులో కించపరిచారు.. అందుకే..

రాజధాని ఆందోళనల్లో భాగంగా మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే ఆరోపణలపై అరెస్టయిన ఆరుగురు అమరావతి గ్రామాల వాసులు జైలు నుంచి విడుదలయ్యారు.
నిన్న ఉదయం నాగరాజు, నరేశ్‌, సురేంద్ర, శ్రీనివాసరావు, నరసింహస్వామి, భుక్యా లోక్‌నాయక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ ఉదయం ఆరుగురు రైతులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం రూ.10వేల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముసుగులో కొందరు తమను కించపరిచారని.. అందుకే దాడి ఘటన జరిగిందన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet