అదికార పక్షమైనా విపక్షమైనా, అమరావతి గ్రాఫిక్సయినా అనంతపురం రెయిన్ గన్ వ్యవసాయమైనా…దార్శనికత, పారదర్శకత, అభివృద్ధి, చట్టబద్ధతలే నా శ్వాస, ఊపిరిలంటూ చెప్పుకొనే చంద్రబాబునాయుడు ఇతరులేం చేసినా అస్తవ్యస్తం,చట్ట, ప్రజావ్యతిరేకం అంటూ గగ్గోలుపెడుతుంటారు. తాజాగా ఆయన తన విజనరీలో అమరావతి సైతం వికేంద్రీకరణలో భాగమేనంటూ కొత్త థియరీని ఆవిష్కరించాడు. అక్కడితో ఆగకుండా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ పాత పల్లవినే పాడాడు.
మైండ్ బ్లాక్ థియరీ…
అమరావతి వికేంద్రీకరణలో భాగం…! పూర్తిగా నిర్వేదంలో కూరుకుపోవడం వల్లే చంద్రబాబు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడనిపిస్తోంది. పదవిలో ఉన్నన్నాళ్లు అమరావతి తప్ప మరో పేరును ఉచ్ఛరించనైనా ఉచ్ఛరించని చంద్రబాబు…ఇతర జిల్లాలు,నగరాలపై శీతకన్నేసిన చంద్రబాబు… నేడు అమరావతి వికేంద్రీకరణలో భాగం అనడం నిజంగా విడ్డూరం. బహుశా అమరావతిలో సమస్తం ఓ వర్గం వారికి పప్పు బెల్లాల్లా పంచడమే చంద్రబాబు వికేంద్రీకరణ విజనరీ కావొచ్చు.
జగన్ జనతా గ్యారేజ్
అమరావతి పుట్టుకలోనే ప్రజావెన్నుపోటు కనిపిస్తుంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం అస్మదీయులకు రాజధాని ఎంపికను లీకు చేసిందనేది నిర్వివాదాంశం. కాబట్టే ఓ పార్టీ, ఓ వర్గం నేతలు జిల్లాలు దాటొచ్చి మరీ అమరావతికి చుట్టుపక్కల పొలాలు, స్థలాలను చౌకగా కొన్నారు. తద్వారా అమాయకులైన ప్రజలకు పంగనామాలు పెట్టారు. అమరావతిలో భూములు కొన్న నేతలు, బడా బాబుల పేర్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏకధాటిగా రెండు గంటల పాటు అసెంబ్లీలో చదివి వినిపించారు. దాంతో కళ్లప్పగించడం రాష్ట్ర ప్రజల వంతైంది. కానీ, చంద్రబాబు మూత్రం అమరావతి భూభాగోతం గురించి అస్సలు మాట్లాడకుండా అంతా పారదర్శకమే అనే తరహాలో కలరింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ తతంగం అంతా ఆయన కనుసన్నుల్లోనే జరిగింది కాబట్టి….!
Also Read:కొత్త జిల్లాలపై కమిటీ అధ్యయనం చేసే అంశాలివే.
సేకరణొద్దు సమీకరణే ముద్దు కానీ….
వేల ఎకరాలు సేకరించడం అసాధ్యమని, పరిహార భారం మోయలేమని భావించిన చంద్రబాబు భూసేకరణ చట్టాన్ని పక్కనబెట్టి భూసమీకరణ విధానాన్ని ఎంచుకున్నాడు. అదే సమయంలో అమరావతి ప్రాంతం నగర నిర్మాణానికి అనుకూలం కాదని, నిర్మాణాలకు, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు తడిసిమోపడవుతుందని ఎంతమంది చెప్పినా చంద్రబాబు వినలేదు. ఎందుకు? భారం అవుతుందని భూసేకరణను బైపాస్ చేసిన బాబు అమరావతిలో మాత్రం ఖర్చులు భారమెంతైనా పర్వాలేదంటూ ఎందుకు ముందుకెందుకెళ్లారు? అటవీ భూమలు అందుబాటులో ఉన్నా కాదని రియల్ ఎస్టేట్ వ్యవహారానికి ఎందుకు తెరలేపారు? వీటికి ఓ వర్గానికి మేలు చేయాలనే ఆరాటం, ఆశ్రిత పక్షపాతం, స్వీయ అజెండాలు కారణం కాదా…?!
సెల్ఫ్ డబ్బాకే సెల్ఫ్ ఫైనాన్స్….
అమరావతిని కీర్తించడంలో చంద్రబాబు, ఓ వర్గం మీడియాలు అస్సలెక్కడా వెనకాడవు. చంద్రబాబు మొదటి నుంచీ అమరావతి విషయంలో తనదో అద్భుతమైన దార్శనికతంటూ చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టంటూ తనదైన భాష్యం చెప్పాడు. ఈ విషయంలో చంద్రబాబు తీరు వినేవాడు చెవిటి వాడైతే ఏదైనా చెప్పొచ్చు అనే తరహాలో ఉంది.
మరి నిజంగా అమరావతికే ఆ స్థాయి స్వీయ సామర్థ్యాలు ఉండుంటే ఐదేళ్లకాలంలో తాత్కాలిక స్థాయిలోనే ఎందుకు తచ్చట్లాడాల్సి వచ్చింది? మౌలిక వసతులకు సైతం కేంద్ర నిధులపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది? సీడ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ గిట్టుబాటు కాదంటూ సింగపూర్ కన్సార్షియం ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి! ఒక నేత…అదీ రాష్ట్ర స్థాయి …అడుగడుగునా స్వీయ ప్రయోజనాలతో రూపకల్పన చేసిన ఒక నగరానికి తనను తానే నిర్మించుకోగలిగే, అభివృద్ధి చేసుకోగలిగే సామర్థ్యాలు ఉంటే పాలనలో తలపండిన ప్రపంచాధినేతలకు ఇంకెన్ని అతీత శక్తులు ఉండాలి? బహుశా వాళ్లు ఈ విషయం తెలియకే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధుల వద్దకు అప్పుల కోసం తిరుగుతున్నారు కాబోలు…!
Also Read:ఆంధ్రా సీఎస్ కు ఎక్సటెన్షన్
దీనికి సమాధానం ఉందా…?
ఏపీ ప్రజలకు అమరావతి ఒక అద్భుతంగా చూపెడుతన్న చంద్రబాబు అదే విషయాన్ని సింగపూర్ కన్సార్షియంకు ఎందుకు చెప్పలేకపోయాడు? సీడ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ నుంచి వైదొలిగినప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సామర్థ్యాలను వాళ్లకు వివరించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు? ఇక వేళ చేసినా వాళ్లెందుకు పట్టించుకోలేదు! సింగపూర్ కన్సార్షియం స్థానంలో మరొకరిని ఎందుకు తీసుకురాలేకపోయాడు? ఇవి చంద్రబాబు అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్ కేంద్రంగా చెప్పాల్సిన ప్రశ్నలు.
కోర్ క్యాపిటల్‌లో సింగపూర్ వాళ్లు వందల ఎకరాలు అడిగారనేది వాస్తవం. కానీ, కొన్ని కారణాల వల్ల చంద్రబాబుకి అది సాధ్యం కాలేదు. దాంతో సింగపూర్ కన్సార్షియం సీడ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ నుంచి వైదొలిగింది. కన్సార్షియం అడిగిన భూమిని ఎందుకివ్వలేకపోయారు ? ఇస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు చంద్రబాబు ఇంత వరకు సమాధానం చెప్పలేదు.
లాభసాటి అంటే ఇదేనా…..
అమరావతి విషయంలో చంద్రబాబు ఓ ప్రభుత్వాదినేతగా కాకుండా ఓ రియల్ ఎస్టేట్ నిర్వాహకుడిగా వ్యహరించాడని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎకరా రూ.25 వేలకు కవులకి దొరుకుతుంటే ప్రజా ధనాన్ని ఏడాదికి రూ.35 వేల చొప్పున 10 ఏళ్ళకి కవులు చెల్లించి, రోడ్లు, భూములకు లే అవుట్లు, కరెంట్, మౌలిక వసతులు కల్పించి ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం ఏమాత్రం లాభసాటో చంద్రబాబే చెప్పాలి. వేల ఎకరాల భూమి అప్పనంగా ఇచ్చి ఒక కోర్ క్యాపిటల్‌ను డెవలప్ చేయమంటే అవే భూములను తాకట్టు పెట్టి మన బ్యాంకుల దగ్గర అప్పులిప్పాస్తామన్నా సింగపూర్ కంపెనీ ఎందుకు వెనకడుగు వేసింది? ఇంకా ఎందకు ఎక్కువ భూమి కావాలని డిమాండ్ చేసింది? ఎందుకంటే అమరావతి ప్రాజెక్టు లాభసాటి కాదనే కదా…!
అధికారమే పరమావధిగా…
చంద్రబాబు అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తాడనే విషయం చాలా సార్లు వెల్లడైన సంగతే. గతంలో తెలంగాణా రాష్ట్రం కావాలని కేంద్రానికి మెదట లెటర్ ఇచ్చింది చంద్రబాబే. అయితే నిజంగా తెలంగాణ రావాలని బాబు కోరుకున్నాడా అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి! కాకపోతే అధికారం కోసం అలాంటి జిమ్ముక్కులు చేయడం చంద్రబాబుకు అలవాటైన పని. ఇప్పుడు ఒక వేళ జగన్ అమరావతినే కొనసాగించి ఉన్నా రేపటి ఎన్నికల నాటికి రాయలసీమ డిక్లరేషన్ అనే వాళ్ళని రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీని అస్థిరపరచాలనే ప్రయత్నం చంద్రబాబు చేయడనే గ్యారెంటీ లేదు…!