iDreamPost
android-app
ios-app

హీరోకు 56 కోట్ల అప్పు.. రంగంలోకి దిగిన అక్షయ్‌ కుమార్‌!

  • Published Aug 21, 2023 | 3:54 PM Updated Updated Aug 21, 2023 | 3:54 PM
  • Published Aug 21, 2023 | 3:54 PMUpdated Aug 21, 2023 | 3:54 PM
హీరోకు 56 కోట్ల అప్పు.. రంగంలోకి దిగిన అక్షయ్‌ కుమార్‌!

ప్రముఖ బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్‌ అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. బ్యాంకు నుంచి తీసుకున్న 56 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించని కారణంగా సదరు బ్యాంకు ఆయనపై చర్యలకు పూనుకుంది. ముంబై, జుహులోని సన్నీ డియోల్‌ బంగ్లాను వేలం వేయటానికి సిద్ధమైంది. ఈ మేరకు నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలోనే సన్నీ డియోల్‌ అప్పులు తీర్చడానికి స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రంగంలోకి దిగారన్న వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తల ప్రకారం.. బంగ్లా అమ్మకుండా ఉండేందుకు తాను సాయం చేస్తానని అక్షయ్‌.. సన్నీ డియోల్‌కు చెప్పారంట. బ్యాంకు నోటీసులు వచ్చిన తర్వాత ఇద్దరు హీరోలు ఓ చోట కలుసుకున్నారట.

ఆ సందర్భంలోనే సన్నీ డియోల్‌కు అక్షయ్‌ భరోసా ఇచ్చారంట. దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నారంట. అయితే, ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది. ఈ పుకార్లపై అక్షయ్‌ కుమార్‌ తరపు అధికారిక ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ’’ అని తేల్చేశారు. కాగా, సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన గదర్‌ 2 సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2001లో వచ్చిన గదర్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక, అక్షయ్‌ నటించిన ఓ మై గాడ్‌ సినిమా కూడా ఆగస్టు 11నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. మరి, సన్నీ డియోల్‌కు అక్షయ్‌ కుమార్‌ సాయం అన్న తప్పుడు వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom