iDreamPost
android-app
ios-app

అక్కినేని బ్రదర్స్ మధ్య ఏప్రిల్ వార్

  • Published Feb 10, 2020 | 12:41 PM Updated Updated Feb 10, 2020 | 12:41 PM
  • Published Feb 10, 2020 | 12:41 PMUpdated Feb 10, 2020 | 12:41 PM
అక్కినేని బ్రదర్స్ మధ్య ఏప్రిల్ వార్

చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అక్కినేని బ్రదర్స్ మొదటిసారి పోటీ పడటం తప్పేలా లేదు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సమ్మర్ ని టార్గెట్ చేసిన ఈ మూవీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలనీ యూనిట్ డిసైడ్ అయినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. సెన్సిబుల్ మూవీస్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని ఫిదాతో నిరూపించిన శేఖర్ కమ్ముల మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

నాగ చైతన్యకు మజిలీ లాంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో తానూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపగల శేఖర్ కమ్ముల చైతు సాయిపల్లవి జంటను ఎలా చూపిస్తాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉండగా అఖిల్ నటిస్తున్న నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఏప్రిల్ ని టార్గెట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు బాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసుకునే పనిలో ఉంది. బొమ్మరిల్లుతో యావత్ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన భాస్కర్ ఆ తర్వాత కనీస స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ బ్యాచిలర్ ని మాత్రం చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది.

మొన్నో లుక్ వదిలారు కానీ ఫ్యాన్స్ ఇంకా ఏదైనా బలమైన ప్రమోషన్ ని కోరుకుంటున్నారు. అనుకున్న టైంలో అన్ని ఫినిష్ అయిపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఏప్రిల్ లోనే రావొచ్చు. అయితే ఏ తేదీకి ఎంత గ్యాప్ తో ఈ ఇద్దరు వస్తారనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ తర్వాత మాత్రమే తెలుస్తుంది. మొత్తానికి అక్కినేని అన్న తమ్ముళ్లు ఇలా పోటీకి రావడం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఏదైనా అడ్జస్ట్ మెంట్ లో భాగంగా ఒకరెవరైనా వెనక్కు తగ్గుతారేమో చూడాలి. సమ్మర్ అడ్వాంటేజ్ ని వదులుకునేందుకు సాధారణంగా ఎవరూ ఇష్టపడరు కాబట్టి ఒకవేళ నిజంగా ఈ క్లాష్ కనక నిజమైతే అభిమానులకు అంతకన్నా పండగ ఏముంటుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş