iDreamPost
android-app
ios-app

అంత దూరమెందుకు బ్యాచిలర్

  • Published Mar 01, 2020 | 11:40 AM Updated Updated Mar 01, 2020 | 11:40 AM
  • Published Mar 01, 2020 | 11:40 AMUpdated Mar 01, 2020 | 11:40 AM
అంత దూరమెందుకు బ్యాచిలర్

అక్కినేని అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చివరి దశలో ఉంది. యూనిట్ రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు కానీ అందుతున్న సమాచారం మేరకు ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని తెలిసింది. ఇదిలా ఉండగా దీని విడుదల తేదిని మే 22కి లాక్ చేయాలనుకుంటున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. దీని ప్రకారం ఇంకా ఎనిమిది రోజులు తక్కువ మూడు నెలల టైం ఉంది. అంత ఆలస్యం ఎందుకనే సమాధానం మాత్రం ప్రస్తుతానికి రావడం లేదు.

నిజానికి నాగ చైతన్య చేస్తున్న లవ్ స్టొరీతో క్లాష్ రాకుండా ఒక అండర్ స్టాండింగ్ తో ఏప్రిల్ లోనే రిలీజ్ చేసే విధంగా ప్లానింగ్ జరుగుతున్నట్టు గతంలోనే న్యూస్ వచ్చింది. కాని ఇప్పుడు బ్యాచిలర్ ఏకంగా మే ఆఖరికి షిఫ్ట్ అయితే మరి లవ్ స్టొరీ అంతకన్నా ముందే వస్తుందా లేక ఇంకా లేట్ అవుతుందా అనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. మే మంచి సమ్మర్ సీజన్ అయినప్పటికీ ఆ టైంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది.

సల్మాన్ ఖాన్ రాదేతో పాటు ఫాస్ట్ అండ్ ఫ్యురియాస్ లేటెస్ట్ ఎడిషన్ కూడా వస్తోంది. ఏ సెంటర్స్ లో వీటి పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మరి అలాంటప్పుడు సేఫ్ గా అనిపించే ఏప్రిల్ ని ఎందుకు వదిలేస్తున్నారనే సందేహం కలగక మానదు. అఫీషియల్ గా ప్రకటించే వరకు దీని గురించి క్లారిటీగా ఏదీ చెప్పలేం. టాలీవుడ్ లో ఫుల్ బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు మైంటైన్ చేస్తున్న పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. ప్రస్తుతానికి ఇప్పటిదాకా రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు కాని మరీ బ్రహ్మాండమైన స్పందనైతే దక్కలేదు. అఖిల్ కు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు ఇది హిట్ కావడం చాలా కీలకం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş