iDreamPost
iDreamPost
ప్రముఖ బిలియనీర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ప్రారంభించిన ఆకాశ ఎయిర్ డొమెస్టిక్ సర్వీస్ తొలి కమర్షియల్ ఫ్లైట్ బోయింగ్ 737 మ్యాక్స్ టేకాఫ్ కి సిద్ధమైంది. ఆగస్టు 7న ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఈ విమానం గాల్లోకి ఎగరబోతోంది. ఈ రూట్ లో వారానికోసారి నడిచే 28 విమాన సర్వీసులకు, అలాగే ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్ లో తిరిగే మరో 28 సర్వీసులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ఓ ప్రకనటలో తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొబైల్ యాప్, లేదా వెబ్ సైట్ లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతానికి రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ద్వారా ఆకాశ ఎయిర్ ఫ్లైట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. బోయింగ్ సంస్థ ఇప్పటికే ఒక విమానాన్ని డెలివర్ చేయగా మరో విమానం ఈ నెలాఖరుకు సిద్ధం కానుంది. మొత్తం 72 విమానాలు తయారు చేసి ఇచ్చేలా ఆకాశ ఎయిర్.. బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా తమ నెట్ వర్క్ విస్తరిస్తామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, ఛీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ప్రతి నెలా రెండు కొత్త విమానాలు జత చేస్తూ మరిన్ని సిటీలకు సర్వీసులు నడుపుతామని చెప్పారు.