iDreamPost
android-app
ios-app

Ajay Bhupathi & Kartikeya : బ్లాక్ బస్టర్ కాంబోకి పెద్ద సవాల్

  • Published Dec 22, 2021 | 9:19 AM Updated Updated Dec 22, 2021 | 9:19 AM
  • Published Dec 22, 2021 | 9:19 AMUpdated Dec 22, 2021 | 9:19 AM
Ajay Bhupathi & Kartikeya : బ్లాక్ బస్టర్ కాంబోకి పెద్ద సవాల్

మూడేళ్ళ క్రితం ఆరెక్స్ 100 విడుదలైనప్పుడు ఎలాంటి అంచనాలు లేవు.అదే రోజు పోటీగా వచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత మీదే అంతో ఇంతో హైప్ ఉంది. కానీ ఫలితం మాత్రం రివర్స్. అనూహ్యంగా ఆరెక్స్ 100కి యూత్ బ్రహ్మరధం పట్టారు. ఊహించని విధంగా అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ స్టేటస్ ఇచ్చేశారు. ఇండస్ట్రీ హిట్ అనలేం కానీ దాని రేంజ్ కి బిజినెస్ కి అందనంత ఎత్తులో రికార్డులు దక్కిన మాట వాస్తవం. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని ఆ స్థాయిలో నెగటివ్ గా డిజైన్ చేసుకోవడం ఏకంగా బాలీవుడ్ మేకర్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇటీవలే దీని హిందీ రీమేక్ తడప్ రిలీజై కమర్షియల్ గా హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇద్దరికీ ఇప్పుడో సక్సెస్ చాలా అవసరం. దర్శకుడు అజయ్ భూపతి ఊరించి ఊరించి మహా సముద్రంతో ఉసూరుమనిపించాడు. మంచి క్యాస్టింగ్ ని నీరసమైన కథా కథనాలతో వృథా చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇంటర్వ్యూలలో చెప్పుకున్న అతిశయోక్తులు ట్రోలింగ్ కి పనికొచ్చాయి. ఇంతోటి దానికి ఇంత గ్యాప్ తీసుకున్నారా అనే కామెంట్స్ కూడా వచ్చి పడ్డాయి. దీని దెబ్బకు స్టార్ల నుంచి పిలుపులు వచ్చే అవకాశాలు లేవు. సో తన డెబ్యూ హీరోతోనో మరో ప్రాజెక్టు చేసి సత్తా చాటాలనే ప్లానింగ్ లో అజయ్ భూపతి ఉన్నారని ఇన్ సైడ్ టాక్. కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

ఇక హీరో కార్తికేయ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. అదే ఆరెక్స్ 100 తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. హిప్పీ, 90 ఎంఎల్, గుణ 369, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క ఇలా ఒకదాన్ని మించి మరొకటి మార్కెట్ ని అంతకంతా దిగజార్చుకుంటూ వెళ్లాయి. ఇంతకు ముందు మంచి ఓపెనింగ్స్ దక్కేవి కానీ ఇప్పుడు అవీ లేవు. సో తనకు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా అజయ్ భూపతి మీద ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. సో ఓకే చెప్పొచ్చు. జెమినీ ఫిలిం సర్క్యూట్స్ బ్యానర్ మీద ఇది రూపొందే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారని న్యూస్. కార్తికేయ అజిత్ వలిమైలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే

Also Read : Ghost : ఘోస్ట్ కోసం లెజెండ్ భామ

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss