iDreamPost
android-app
ios-app

Thalaivar 169 : రజినీకాంత్ కు తగ్గ హీరోయిన్ ఐశే

  • Published Feb 19, 2022 | 5:24 AM Updated Updated Feb 19, 2022 | 5:24 AM
  • Published Feb 19, 2022 | 5:24 AMUpdated Feb 19, 2022 | 5:24 AM
Thalaivar 169 : రజినీకాంత్ కు తగ్గ హీరోయిన్ ఐశే

సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్థాయి బ్లాక్ బస్టర్ అందుకుని ఏళ్ళు దాటుతోంది కానీ ఆయన మాత్రం సినిమాలు చేసే స్పీడ్ లో తగ్గడం లేదు. ఆ మధ్య వచ్చిన పెద్దన్న ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కనీసం శాటిలైట్ టిఆర్పి రేటింగ్స్ అయినా వచ్చాయి కానీ ఇక్కడ మరీ దారుణం. తెలుగులో మార్కెట్ బాగా డౌన్ అయిపోయిన తలైవా తన రేంజ్ బొమ్మ ఒకటి చేయాలే కానీ దాన్ని సూపర్ హిట్ చేసేందుకు ఇక్కడి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా సరే వీలైనన్ని ఎక్కువ చిత్రాలు ఇప్పటి తరం దర్శకులతో చేయాలనే రజినీకాంత్ ఆలోచన నిజంగా స్ఫూర్తిదాయకం.

రజని నెక్స్ట్ మూవీ కోకోకోకిల, డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ఎంటర్ టైనర్ ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించనుంది. డార్క్ కామెడీలో ఎక్స్ పర్ట్ అయిన నెల్సన్ ఈసారి తలైవాను ఎవరూ చూపించని రీతిలో ప్రెజెంట్ చేయబోతున్నారట. ప్రస్తుతం బీస్ట్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ అది రిలీజ్ అయ్యాక రజని సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసేలా యూనిట్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తోందని సమాచారం.

ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అభిషేక్ బచ్చన్ తో పెళ్లయి తల్లయ్యాక ఐష్ నటించడం తగ్గించేసింది. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ ఒకటే తన చేతిలో ఉంది. గతంలో రోబోలో రజనీకాంత్ ఐశ్వర్యరాయ్ లు సందడి చేయడం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తే అంతకంటే వాళ్లకు కావాల్సింది ఏముంటుంది. రజని లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు జోడీని సెట్ చేయడం దర్శకులకు సవాల్ గా మారింది. అందుకే ఐశ్వర్య రాయ్ తరహా వాళ్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ అందాల తార గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి

Also Read : KGF 2 : రాఖీ భాయ్ కోసం రిపేర్లు చేస్తున్నారు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom