iDreamPost
android-app
ios-app

Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ ఆఫర్‌.. రూ.49కే అన్‌లిమిటెడ్‌ డేటా

  • Published Feb 14, 2024 | 1:46 PM Updated Updated Feb 14, 2024 | 3:13 PM

అన్‌లిమిటెడ్‌ డేటా కావాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని వల్ల అపరిమిత డేటా పొందవచ్చు. ఆ వివరాలు..

అన్‌లిమిటెడ్‌ డేటా కావాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని వల్ల అపరిమిత డేటా పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Feb 14, 2024 | 1:46 PMUpdated Feb 14, 2024 | 3:13 PM
Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ ఆఫర్‌.. రూ.49కే అన్‌లిమిటెడ్‌ డేటా

నేడు పిల్లలు, పెద్దలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయి. దాంతో ఇంటర్నెట్‌ డేటా వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే టెలికాం కంపెనీలు అనేక రకాల ప్యాక్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. డైలీ డేటా ప్యాక్‌లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది డైలీ 1, 2 జీబీ డేటా వచ్చేలా రీచార్జ్‌ ప్లాన్‌లు సెలక్ట్‌ చేసుకుంటున్నారు. మూవీలు, వీడియోలు చూస్తే.. డేటా త్వరగా అయిపోతుంది. అదుగో అలాంటి వారి కోసమే ఎయిర్‌టెల్‌ ఓ అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించింది. ఆ వివరాలు..

డేటా డైలీ లిమిట్‌ అయిపోయిన తర్వాత.. కూడా సినిమాలు, వీడియోలు చూడాలి.. మొబైల్‌లో ఇంటర్నెట్‌ వాడాలి అనుకునే వారి కోసం ఎయిర్‌టెల్‌ కంపెనీ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఈ ప్లాన్‌ను రీచార్జ్‌ చేసుకుంటే మీరు అన్‌లిమిటెడ్‌ డేటా పొందవచ్చు. అది కూడా కేవలం 49 రూపాయలకే. ఈ ప్లాన్‌ ద్వారా మీరు 20 జీబీ వరకు అన్‌లిమిటెడ్‌ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్‌ రీఛార్జ్‌ చేసుకుంటే మీ డైలీ డేటా లిమిట్‌ అయిపోయినా సరే.. ఈ అన్‌లిమిటెడ్‌ డేటా ద్వారా మీ ఫోన్‌లో నెట్‌ బ్రౌజ్‌ చేసుకోవచ్చు.. వీడియోలు, సినిమాలు చూడవచ్చు.

Huge offer for Airtel users

ఈ 49 రూపాయల ప్యాక్‌లో వినియోగదారులకు 20 జీబీ వరకు అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది. కాకపోతే నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటుంది. ప్లాన్‌ ముగిసిన తర్వాత.. ఇంటర్నెట్‌ ప్పీడ్‌ 64కేబీపీఎస్‌కి తగ్గుతుంది. ఎయిర్‌టెల్‌ ప్రకటించిన ఈ ఆఫర్‌ పాతదే. అయితే గతంలో కేవలం 6 జీబీ డేటా లిమిట్‌ అందుబాటులో ఉండేది. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఇప్పుడు దాన్ని మూడు రేట్లకు పైగా పెంచింది. డేటా వినియోగంలో తమ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఎయిర్‌టెల్‌ కంపెనీ ఇలాంటి మార్పులు చేసిందని టెక్‌ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్న యూజర్లు రోజు వారీ డేటా లిమిట్‌ పూర్తైన సమయంలో.. ఈ లేటెస్ట్‌ రీచార్జ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్‌ కావాలనుకునే యూజర్లు.. కచ్చితంగా యాక్టీవ్‌ రీఛార్జ్‌ ప్యాక్‌ కలిగి ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. ఎక్కువ సమయంలో మొబైల్‌ డేటా వాడే వారికి ఈ ప్లాన్‌ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.