iDreamPost

Airtel కొత్త డేటా ప్లాన్..రూ.9కే 10జీబీ డేటా! కానీ..

  • Published Jun 21, 2024 | 5:37 PMUpdated Jun 21, 2024 | 5:37 PM

భారత టెలికాం రంగ సంస్థలో ఒకటైన ఎయిర్ టెయిల్ తమ కస్టమర్ల కోసం ఎప్పుడు రకరకాల ఆకర్షణీయమైన ప్లాన్ లను తీసుకువస్తునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ తమ కోట్లాదిమంది కస్టమర్ల కోసం మంచి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

భారత టెలికాం రంగ సంస్థలో ఒకటైన ఎయిర్ టెయిల్ తమ కస్టమర్ల కోసం ఎప్పుడు రకరకాల ఆకర్షణీయమైన ప్లాన్ లను తీసుకువస్తునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ తమ కోట్లాదిమంది కస్టమర్ల కోసం మంచి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Published Jun 21, 2024 | 5:37 PMUpdated Jun 21, 2024 | 5:37 PM
Airtel కొత్త డేటా ప్లాన్..రూ.9కే 10జీబీ డేటా! కానీ..

ప్రముఖ టెలికాం రంగ సంస్థల్లో ఎయిర్ టెల్ కూడా ఒకటి. ఇక ఈ ఎయిరెటల్ సంస్థకు మార్కెట్ లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోట్లాది మంది కస్టమర్లు ఈ ఎయిర్ టెల్ ను నెట్ వర్క్ ను వినియోగిస్తుంటారు. అంతేకాకుండా.. ఈ టెలికాం సంస్థకు నెంబర్ వన్ సంస్థగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఇక ఎయిర్ టెల్ టెలికాం సంస్థ అనేది తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు రకరకాల అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త బెస్ట్ రీఛార్జ్  ప్లాన్  ను ఈరోజు కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే..

భారత టెలికాం రంగ సంస్థలో ఒకటైన ఎయిర్ టెయిల్ తమ కస్టమర్ల కోసం ఎప్పుడు రకరకాల ఆకర్షణీయమైన ప్లాన్ లను తీసుకువస్తునే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ తమ కోట్లాదిమంది కస్టమర్ల కోసం మంచి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైగా దీని ధర కూడా చాలా తక్కువ కావడం గమన్హారం. అయితే ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అనేది రూ. 9 మాత్రమే. పైగా ఇది ఒక డేటా వోచర్. అంటే దీంతో ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. కానీ, ఈ ప్లాన్ లో మొత్తం 10జీబీ డేటా లభిస్తుంది. ఇకపోతే ఇక్కడే ఓ తిరకాసు ఉంది. అదేమిటంటే.. ఈ డేటా రీఛార్జ్ ప్లాన్ అనేది కేవలం ఒక గంటోని మాత్రమే వాడేసుకోవాలి.

Airtel New Plan

అయితే ఈ డేటా రీఛార్జ్ ప్లాన్ అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కాకపోతే ఇది ఏదైనా పెద్ద సైజ్‌ డేటా ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమో, స్వల్పకాలం కోసం వేగవంతమైన డేటా కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి డేటా ప్లాన్ ఉపాయోగపడుతుంది. కాగా, ప్రస్తుతం ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లలో 10జీబీ డేటా కావాలంటే రూ.100కు పైగానే చెల్లించాల్సి వస్తోంది. కానీ, ఇక్కడ మాత్రం రూ.9కే 10జీబీ డేటా అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఒక గంటకు మాత్రమే పరిమితం. ఇక ఈ ప్లాన్ గురించి వివరాలను తెలుకోవాలంటే.. మొబైల్ యాప్, ఎయిర్ టెల్ వెబ్ సైట్ నుంచి సందర్శించి రీఛార్జ్ చేసుకోవచ్చు. మరి, ఎయిర్ టెల్ నుంచి రూ.9లకే 10జీబీ డేటా అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి