iDreamPost
android-app
ios-app

కర్ణాటక కాంగ్రెస్ మెడకు హనీ ట్రాప్ ఉచ్చు, టాప్ లీడర్స్ తో నవ్యశ్రీ దిగిన ఫొటోలు వైరల్

  • Published Jul 21, 2022 | 3:56 PM Updated Updated Jul 21, 2022 | 3:56 PM
కర్ణాటక కాంగ్రెస్ మెడకు హనీ ట్రాప్ ఉచ్చు, టాప్ లీడర్స్ తో నవ్యశ్రీ దిగిన ఫొటోలు వైరల్

ఆయనే మా వారు అని ఆవిడ అంటుంటే ఆవిడసలు మా ఆవిడే కాదు అంటున్నాడు ఆయనగారు. ఈ ఫ్యామిలీ డ్రామాకు వేదికైంది కర్ణాటకలోని బెళగావి. ఇక్కడ ఆవిడ కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్యశ్రీ రావు అయితే ఆయన హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజకుమార టకాళె. వీళ్ళిద్దరి మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ కావడంతో విషయం మరింత సీరియస్ అయింది. దీనిపై రాజకుమార పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవ్యశ్రీ తనను మానసికంగా హింసిస్తోందని, ఆమె వల్ల తన ప్రాణానికి ముప్పుందని కంప్లెయింటులో పేర్కొన్నారు. అయితే నవ్యశ్రీ ఆయనకో కొత్త షాక్ ఇచ్చారు. రాజ కుమార తనని పెళ్ళి చేసుకున్నాడని, దానికి రుజువులు కూడా ఉన్నాయని ప్రకటించారు. త్వరలోనే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని వివరాలు తెలియజేస్తానని ఆమె చెప్పారు. రాజకుమార మాత్రం పెళ్ళి ఆరోపణలను ఖండిస్తున్నారు. తనకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారని, అది తెలిసి కూడా నవ్యశ్రీ తనకు దగ్గరైందని చెబుతున్నారు. కష్టాల్లో ఉందని తెలిసి కొంత డబ్బు సాయం చేశానన్నారు. ఇప్పుడీ వీడియోలను అడ్డం పెట్టుకుని 50 లక్షలు కావాలని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని టకాళే ఆరోపించారు.

లేటెస్ట్ గా ఈ వివాదం కర్ణాటక క్రాంగెస్ మెడకు చుట్టుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సహా చాలా మంది లీడర్స్ తో నవ్యశ్రీ దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆమెతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నాయకులు చెబుతున్నారు. రాజకీయంగా తన ఎదుగుదల ఓర్వలేకే ఎవరో ఇలా కావాలని ఇరికించారని ఇటు నవ్యశ్రీ తనదైన స్టైల్ లో చెబుతున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş