iDreamPost
android-app
ios-app

గూడఛారి 2 ఆలస్యం! నిర్ణయం తెలిస్తే అడవి శేషుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

  • Published Nov 13, 2023 | 1:39 PM Updated Updated Nov 13, 2023 | 1:39 PM

స్పై సినిమాలు అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ గూఢచారి సినిమానే గుర్తొస్తుంది. అయితే ఆ సినిమా సీక్వెల్ గూఢచారి 2 నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావట్లేదు.

స్పై సినిమాలు అనగానే తెలుగు ప్రేక్షకులకు అడివి శేష్ గూఢచారి సినిమానే గుర్తొస్తుంది. అయితే ఆ సినిమా సీక్వెల్ గూఢచారి 2 నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావట్లేదు.

  • Published Nov 13, 2023 | 1:39 PMUpdated Nov 13, 2023 | 1:39 PM
గూడఛారి 2 ఆలస్యం! నిర్ణయం తెలిస్తే అడవి శేషుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో స్పై బ్యాక్ డ్రాప్ సినిమాల హవా నడుస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు స్పై సినిమాలు చేసేస్తున్నారు. ఇంక హిందీలో అయితే స్పై యూనివర్స్ నే క్రియేట్ చేశారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ యూనివర్స్ లో ఒక పార్ట్ కానున్నాడు. అయితే టాలీవుడ్ లో మాత్రం స్పై అనగానే అందరికీ అడవి శేషూనే గుర్తొస్తాడు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో అడవి శేషుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యాక్టింగ్ మాత్రమే కాకుండా రైటింగ్, డైరెక్షన్ తో కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి గూఢచారి 2 మీదే ఉంది. కానీ, ఆ సినిమా విషయంలో మాత్రం అడివి శేష్ చాలా నిదానంగా ఉన్నాడు. కానీ, దానికి బలమైన కారణమే ఉందని తెలుస్తోంది.

స్పై చిత్రాలకు ఎంత హైప్ ఉన్నా కూడా సినిమాలో సత్తా లేకపోతే విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే స్పై థ్రిల్లర్ సినిమాల్లో కథ, కథనం ఎంతో బలంగా ఉండాలి. ఎంత స్టార్ కాస్ట్ ఉన్నా కూడా సినిమాలో బలమైన కథ లేకపోతే మాత్రం ఆడియన్స్ అస్సలు రిసీవ్ చేసుకోరు. ఈ విషయానికి సంబంధించి తాజాగా టైగర్ 3 సినిమానే ప్రధాన ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే టైగర్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియో రోల్స్ చేసినా కూడా ఆ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకంటే స్టోరీలో బలంలేదు, గూస్ బంప్స్ తెప్పించే ఎలాంటి సీన్స్ లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి విషయాలపైనే అడవి శేష్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో రెస్ట్రిక్షన్స్, గొప్ప గొప్ప స్టార్లు లేకపోవడం వంటి సమస్యలు అడవి శేష్ కు ఉంటూనే ఉంటాయి. కానీ, గూఢచారి సినిమా హిట్ అయ్యిందంటే అందుకు కారణం స్టోరీ టెల్లింగ్, ట్విస్టులు అనే చెప్పాలి. అలాంటి బలమైన కథ కోసమే గూఢచారి మూవీ విషయంలో అడివి శేష్ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఎంత సమయం అయినా తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాడని టాక్ వస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా ఫైనల్ కాలేదు. అసలు సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసేందుకు కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

కానీ, అడివి శేష్ మాత్రం సినిమాల విషయంలో కంగారు పడటంలేదు. అతని స్టోరీ సెలక్షన్, యాక్టింగ్ కు టాలీవుడ్ లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఇప్పుడు గూఢచారి 2 సినిమా కోసం అడివి శేష్ ఎక్కువ సమయం తీసుకుంటున్నా కూడా ఎవరూ బాధ పడొద్దని చెబుతున్నారు. ఎంత ఆలస్యం చేస్తే అంత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది తన కలల ప్రాజెక్ట్ అని శేష్ చెప్పాడు. దీనికోసం తాను కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటాను అని చెప్పాడు. ఈ పోస్టర్ రిలీజ్ చేసి కూడా ఇప్పటికి 43 వారాలు అయిపోయింది. మరి.. అడవి శేష్ గూఢచారి సినిమా ఆలస్యం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş