iDreamPost
android-app
ios-app

తొలిరోజే రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఆదిపురుషుడు’… కలెక్షన్లు ఎంతంటే..

తొలిరోజే రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఆదిపురుషుడు’… కలెక్షన్లు ఎంతంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ ఫ్యాన్స్  తో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూన్న ఈ  సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. టీజర్, ట్రైలర్ వంటివి విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమాన్లులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇలా అందరి అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ.. తొలి రోజు కలెక్షన్ల రికార్డు సృష్టించింది. అంతేకాక ఎన్నో రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. మరి.. ఆదిపురుష్ తొలి రోజు రాబట్టిన కలెక్షన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆదిపురుష్. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తాజాగా ఆదిపురుష్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  శుక్రవారం విడుదలైన ఈ మూవీ తొలి రోజే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాక మొదటి రోజు రికార్డుల మోత మోగించింది. ఒక్క సౌత్ లోనే కాదు హిందీలోనూ ప్రభాస్‌ స్టింగ్‌ మోగుతోంది. మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. ఆదిపురుష్ హిందీలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పఠాన్ తర్వాత, ఆదిపురుష్ అత్యధికంగా కలెక్షన్లు సాధించింది. అంతేకాక ఈ సినిమా ఇతర భాషలలో కూడా దాదాపు 50 కోట్లు వసూలు చేసిందంట. ఓవరాల్ గా ఆదిపురుష్ సినిమా ఇండియాలోనే దాదాపు 120 నుంచి 140 కోట్లు రాబట్టిందంట. నేడు, రేపు వీకెండ్ కావడంతో భారీ వసూళ్లను రాబట్టవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా 150 కోట్లను దాటవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టాలీవుడ్ విషయానికి వస్తే.. కొన్ని లెక్కల ప్రకారం…ఆదిపురుష్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు… నైజం ప్రాంతంలో రూ. 50 కోట్లు సాధించింది. అలానే ఆంధ్రాలోని  విశాఖపట్నం రూ. 12.5 కోట్లు, ఈస్ట్, వెస్ట్ లో రూ.15 కోట్లు రాబట్టింది.  సౌత్ ఏపీ ప్రాంతాలైన కృష్ణా రూ. 7.5 కోట్లు, గుంటూరు రూ. 9 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు చోప్పున తొలి రోజు కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా నైజాం, ఏపీ కలిపితే ఆదిపురుష్ మూవీ 115.5 కోట్లు వసూలు చేసినట్లు టాక్. కర్ణాటకలో 12.5 కోట్లతో పాటు వివిధ రాష్ట్రాల్లో రూ.4.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌లో తొలిరోజు రూ.30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు వసూలు చేసిందని కొన్ని లెక్కల ప్రకారం వెల్లడైంది. మరి.. ఆదిపురుష్ తొలి రోజుల కలెక్షన్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş