iDreamPost
android-app
ios-app

టీమిండియా వరల్డ్‌ కప్‌ జెర్సీ రిలీజ్‌ చేసిన అడిడాస్‌! అదిరిపోయిందిగా..

  • Published Sep 20, 2023 | 1:21 PM Updated Updated Sep 20, 2023 | 1:21 PM
  • Published Sep 20, 2023 | 1:21 PMUpdated Sep 20, 2023 | 1:21 PM
టీమిండియా వరల్డ్‌ కప్‌ జెర్సీ రిలీజ్‌ చేసిన అడిడాస్‌! అదిరిపోయిందిగా..

క్రికెట్‌ మహా సంగ్రామం.. వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోర్నీ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. క్రికెట్‌ అభిమానులంతా.. ఈ మెగా టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత సెలెక్టర్లు 15 మంది కూడిన వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌ను సైతం ప్రకటించారు. అక్టోబర్‌ 5 నుంచి ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అసలు సిసలైన క్రికెట్‌ మజాను అభిమానులకు అందించేందుకు అన్ని దేశాల బెస్ట్‌ టీమ్స్‌ సిద్ధమైపోయియి. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్‌ కప్‌ యాంథమ్‌ కూడా రిలీజ్‌ అయింది. ఆ సాంగ్‌ క్రికెట్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే.. వరల్డ్‌ కప్‌ కోసం అన్ని జట్లు సరికొత్త జెర్సీలతో బరిలోకి దిగుతాయి. అలాగే టీమిండియా సైతం వరల్డ్‌ కప్‌ కోసం ప్రత్యేకమైన జెర్సీతో రంగంలోకి దూకనుంది. మన జెర్సీ స్పాన్సర్‌ అడిడాస్‌.. వరల్డ్‌ కప్‌ కోసం ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది. వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని అడిడాస్‌ తాజాగా విడుదల చేసింది. మన జాతీయ జెండాలోని మూడు రంగులను థీమ్‌గా తీసుకుంటూ.. ‘త్రీ కా డ్రీమ్‌’ కాన్సెప్ట్‌తో జెర్సీని డిజైన్‌ చేసింది. జెర్సీ రిలీజ్‌ కోసం ఓ వీడియో సైతం రిలీజ్‌ చేసింది. కిందున్న ఆ జెర్సీ రివీల్‌ వీడియోను చూసి.. జెర్సీ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌: ICC కీలక నిర్ణయం! బ్యాటర్లకు బ్యాడ్‌ న్యూస్‌