iDreamPost
iDreamPost
వచ్చేది ఎన్నికల సీజన్. అందులోనూ ముందస్తు ఊసులు. సీఎం కేసీఆర్ తెలంగాణ అంతటా పర్యటించడానికి సిద్ధమవుతున్నవేళ, ఆయన భద్రత కోసం నూతన కాన్వాయ్ ని ఎర్పాటుచేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూజర్ల కాన్వాయ్ ని కొనుగోలు చేశారు. వీటిని బుల్లెట్ ప్రూఫ్‌తో పటిష్టం చేసేందుకు, విజయవాడ సమీపంలోని, వీరపనేని గూడెంలోని, సంస్థ తయారీ కేంద్రానికి తరలించారు. సీఎం కేసీఆర్ కోసం రెండు బస్సులనుకూడా బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దనున్నారు. ఈ వేహికల్స్ ను ఇంతకుముందే ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి వీరపనేని గూడానికి తీసుకెళ్లారు. ఇప్పటివరకూ బుల్లెట్‌ప్రూఫ్ తయారీ కేంద్రం జార్ఖండ్ లో ఉండేది. అక్కడికే వేహికల్స్ ను తీసుకెళ్లి, బుల్లెట్ ఫ్రూల్ గా తీర్చిదిద్దేవారు.
ఇప్పుడు అదే కంపెనీ ఏపీలో వీరపనేని గూడెంలో ప్రత్యేక తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. అందుకే జార్ఖండ్ కు వెళ్లే వేహికల్స్ అన్నీ, ఏపీకొస్తున్నాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వీవీఐపీలకు ఏపీలోనే బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తయారుచేసి ఇస్తున్నారన్నది సమాచారం. వారంలో సీఎం కేసీఆర్‌కు కొత్త బుల్లెట్‌ప్రూఫ్ కాన్వాయ్ అందుబాటులోని రానుందంట.