iDreamPost
android-app
ios-app

రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో హీరోయిన్ స‌మంత, వీడియో వైర‌ల్

  • Published Jun 18, 2022 | 5:26 PM Updated Updated Jun 18, 2022 | 5:26 PM
  • Published Jun 18, 2022 | 5:26 PMUpdated Jun 18, 2022 | 5:26 PM
రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో హీరోయిన్ స‌మంత, వీడియో వైర‌ల్

సమంత సౌత్ లో పాపుల‌ర్ కాని, నార్త్ జ‌నానికి మాత్రం కామ‌న్ మేన్, పుష్ప నుంచి సూప‌ర్ స్టార్ అయిపోయింది. ముంబై విమానాశ్ర‌యానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో వెళ్లిన‌ప్పుడు ఫ్యాన్స్ అదిరిపోయారు. స‌మంత రోల్స్ రాయిస్ వీడియో ఇప్పుడు ఇండియాలో వైరల్.

రోల్స్ రాయిస్ నుంచి హుందాగా బైట‌కొచ్చిన స‌మంత, ఫోటోగ్రాఫర్‌లు, అభిమానులకు హాయ్ చెప్పింది. ఫోటోలకు పోజులిచ్చింది. ఆమె నెమ్మదిగా విమానాశ్రయం లోప‌లికెళ్లింది.

వీడియోలో రోల్స్ రాయిస్ పూర్తిగా క‌నిపించ‌లేదు. కాకపోతే అది రోల్స్ రాయిస్ ఘోస్ట్. ఇది సమంత సొంతానిదా? లేదంటే ఎయిర్ పోర్ట్ దానిలో వ‌చ్చారా? తెలియ‌దు. సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ లాగే సమంతకు లగ్జ‌రీ కార్స్ అంటే ఇష్టం. ఆమె గ్యారేజీలో Porsche Cayman GTS, Land Rover Range Roverల‌తోపాటు చాలాకార్లున్నాయి. స‌మంత వీటితోపాటు BMW 7-సిరీస్, జాగ్వార్ XF , Audi Q7 కార్ల‌ను వాడ‌తారు.

రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో స‌మంత క‌నిపించ‌డం బహుశా ఇదే మొదటిసారి. వీడియోలోని రోల్స్ రాయిస్ ఘోస్ట్ పాత మోడ‌ల్ ది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ప‌రుగులెడుతుంది. స‌మంతలాంటి స్టార్లు రోల్స్ రాయిస్ కార్లను ఇష్ట‌ప‌డ‌టంతో ఆశ్చ‌ర్య‌మేముంది. రోల్స్ రాయ‌స్ లో జ‌ర్నీ అంటే అదో ఎక్స్ పీరియ‌న్స్ అంటారు. అందుకే సెలబ్రిటీలు కోరుకొనే కారు అయిపోయింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర అలా పెరుగుతూనే ఉంది. రూ. 6.95 కోట్ల నుండి రూ. 7.95 కోట్ల వరకు ఉంటుంది. కారు కస్టమైజేషన్ బ‌ట్టి రేటు మారుతుంది.

రోల్స్ రాయిస్ కార్లను సంజయ్ దత్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, బాలీవుడ్ రాపర్ బాద్షా, చిరంజీవి వంటి సెల‌బ్రిటీలు, సూప‌ర్ స్టార్లు వాడుతున్నారు. ఇండియాలో అంబానీ కుటుంబానికి rolls royce cullinanతోపాటు రోల్స్ రాయిస్ కాన్వాయ్ ఉంది. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్ కూడా రోల్స్ రాయిస్ ను ప‌రుగులుపెట్టిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss