iDreamPost

హీరో ఫాహద్‌ ఫాజిల్‌తో ముద్దుపై స్పందించిన నటి రవీనా!

హీరో ఫాహద్‌ ఫాజిల్‌తో ముద్దుపై స్పందించిన నటి రవీనా!

ఫాహద్‌ ఫాజిల్‌.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతికొద్ది మంది విలక్షణ మలయాళ హీరోల్లో ఫాహద్‌ ముందు వరుసలో ఉంటారు. కరోనా సమయంలో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయిన తర్వాత ఫాహద్‌ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. సౌత్‌ టు నార్త్‌ వరకు తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నారు. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. పాత్ర నచ్చితే చాలు.. విలన్‌గా నటించడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకే అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చేశారు.

ఈ సినిమాలో తన విలనిజాన్ని పీక్స్‌లో చూపించారు. తాజాగా రిలీజై.. సూపర్‌ హిట్‌ అయిన ‘మామన్నన్‌’లోనూ ఫాహద్‌ విలన్‌గా నటించారు. ఈ సినిమాలో ఫాహద్‌కు జోడీగా రవీనా కనిపించారు. ఈ సినిమాలో ఇద్దరి మధ్యా ఓ ముద్దు సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌లో రవీనా ఫాహద్‌ను కౌగిలించుకుంటుంది. తర్వాత అతడి గుండెపై ముద్దు పెడుతుంది. సినిమా షూటింగ్‌ సందర్భంగా రవీనా.. ఫాహద్‌ను కౌగిలించుకుని, చొక్కాపై ముద్దు పెట్టింది. దీంతో చొక్కాపై లిప్‌స్టిక్‌ మరక పడింది.

ఇక, ఆ మరకను చూసి సెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో చాలా సార్లు.. చాలా ఇంటర్వ్యూల్లో రవీనా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాను మేకప్‌ వేసుకోనని అంది. లిప్‌స్టిక్‌ కూడా వాడనని చెప్పింది. అయితే, ఆమె లిప్‌స్టిక్‌ వాడకపోతే చొక్కాపై ఆ మరక ఎలా పడిందన్న అనుమానం సెట్‌లోని వారందరికీ వచ్చింది. ఇదే విషయాన్ని ఆమెను అడిగారు. అది లిప్‌స్టిక్‌ కాదని, తన పెదాల రంగని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో సెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారంట. మరి, నటి రవీనా ముద్దు సీన్‌ కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి