iDreamPost
android-app
ios-app

Nithya Menon అయ్యో నిత్యామీనన్ కు ఏమైంది ? స్టిక్ సహాయంతో నడుస్తుందేంటి ?

  • Published Jun 28, 2022 | 3:15 PM Updated Updated Jun 28, 2022 | 5:09 PM
  • Published Jun 28, 2022 | 3:15 PMUpdated Jun 28, 2022 | 5:09 PM
Nithya Menon అయ్యో నిత్యామీనన్ కు ఏమైంది ? స్టిక్ సహాయంతో నడుస్తుందేంటి ?

ఇష్క్ బ్యూటీ, మలయాళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోంది. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ భార్యగా కనిపించిన నిత్య.. ఆహా తెలుగు ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించింది. తాజాగా నిత్య నటించిన వెబ్ సిరీస్ “మోడ్రన్ లవ్ హైదరాబాద్” జులై 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు.

నిత్యమీనన్ కూడా ఈ ప్రెస్ మీట్ కి హాజరైంది. కానీ.. ఆమె స్టిక్ పట్టుకుని నడుస్తూ రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఈ ఈవెంట్ లో నిత్య మీనన్ స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సాయంతో నడిచింది. స్టేజిపైకి అలాగే వచ్చింది. నిత్యకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. ఈ సందర్భంగా నిత్య మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ లో ఇలాంటి పాత్రే చేశాను. కానీ ఇప్పుడు అదే నిజమయింది. ఇంట్లో స్టెప్ట్ మీది నుంచి స్లిప్ అయి పడటంతో.. ఇలా స్టిక్ పట్టుకుని నడవాల్సి వచ్చిందని తెలిపింది. నడవలేని స్థితిలోనూ ఆమె వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనడం తన డెడికేషన్ ని చూపుతోందని పలువురు నిత్యమీనన్ ను ప్రశంసించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss