iDreamPost
android-app
ios-app

20 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంతో.. అభిమానులను కట్టిపడేసిన మన్మథుడు బ్యూటీ!

  • Published Jun 28, 2023 | 3:10 PM Updated Updated Jun 28, 2023 | 3:10 PM
  • Published Jun 28, 2023 | 3:10 PMUpdated Jun 28, 2023 | 3:10 PM
20 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంతో.. అభిమానులను కట్టిపడేసిన మన్మథుడు బ్యూటీ!

కొంత మంది నటీనటులు ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటించినా ప్రేక్షకుల మదిలో మాత్రం చెరగని ముద్ర వేసుకుంటారు. సదరు నటీనటులు ఇండస్ట్రీని విడిచి ఏళ్లు గడుస్తున్నా.. ప్రేక్షకులు మదిలో వారి స్థానం.. క్రేజ్‌ అలానే ఉంటాయి. ఇక కొందరు పదుల ఏళ్లు గడిచినా సరే.. అదే అందంతో మెరిసిపోతారు. అలా తన అందమైన రూపం.. అమాయకమైన చూపులతో.. ప్రేక్షకులను కట్టిపడేసింది అన్షు. ఇంతకు ఎవరి గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా.. సుమారు 20 ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు చిత్రంలో ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ పాత్రలో ప్రేక్షకులను పలకరించిన అన్షు గురించి. అందం, అమాయకత్వం కలగలసిన రూపంతో.. ప్రేక్షకులను మాయ చేసింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 20 ఏళ్లు గడిచినా సరే.. ప్రేక్షకులు మాత్రం అన్షును మర్చిపోలేదు. మన్మథుడు తర్వాత కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది అన్షు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. మరి ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది అంటే…

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో అన్షు హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నాగార్జున వంటి స్టార్‌ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అన్షు. కొత్త వారికి అవకాశాలు ఇచ్చే దర్శకుడు కె.విజయభాస్కర్‌ మన్మథుడు చిత్రం కోసం అన్షును ఎంపిక చేశారు. ఈ సినిమాలో అన్షు.. అందమైన రూపం, అమాయకమైన నటన, మత్తెక్కించే చూపులతో, లంగా ఓణిలో బాపు బొమ్మలా కనిపించి ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ చిత్రంలో సోనాలి బింద్రే మరో హీరోయిన్‌గా చేసినా.. అన్షునే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత వెంటనే ప్రభాస్‌ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించింది. తెలుగులో అన్షు హీరోయిన్‌గా చేసింది ఈ రెండు సినిమాల్లోనే. కానీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

ఇక అన్షు ఆఖరి, ఏకైక తమిళ సినిమా ‘జై’. ఆ తర్వాత ఆమె మరే సినిమాలో కనిపింలేదు. ఇక సినిమాల్లో నటించడానికి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన అన్షు.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. లండన్ వ్యక్తినే పెళ్లాడి మళ్లీ అక్కడే సెటిల్‌ అయ్యింది. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సచిన్ సగ్గర్‌ను వివాహం చేసుకుంది అన్షు. ఆమె స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో.. వివాహం తర్వాత లండన్‌లోనే గార్మెంట్స్ బిజినెస్‌ ప్రారంభించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో సొంత లేబుల్‌తో గార్మెంట్ బిజినెస్ రన్‌ చేస్తుంది అన్షు. అన్షుకి ఇద్దరు పిల్లలు. మొదట కూతురు జన్మించగా.. రెండో సంతానంగా బాబు పుట్టాడుఘామెకు ఇద్దరు సంతానం.. పాప, బాబు ఉన్నారు.

సినిమాలకు దూరం అయినప్పటికి.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు అన్షు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తుంటుందితాజాగా అన్షు ఒక సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 20 ఏళ్ల క్రితం‘మన్మథుడు’ సినిమాలో నాగార్జునతో తాను చేసిన ఒక మళ్లీ ఇప్పుడు రీక్రియేట్ చేసింది అన్షు. ఆ సినిమాలో నాగార్జునతో తాను చెప్పిన డైలాగులను ఇప్పుడు కూడా అవే ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పి.. మరోసారి ఫిదా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 20 ఏళ్ల తరవాత కూడా అన్షు అంతే అందంగా ఉన్నారంటూ పొగుడుతున్నారు. ఒక నెటిజన్ అయితే.. ‘నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు మీ కోసం ఈ సినిమాను థియేటర్‌లో 18 సార్లు చూశాను’ అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anshu Saggar (@actressanshuofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss