iDreamPost
iDreamPost
ఒకప్పుడు మాస్ లో మంచి మార్కెట్ సంపాదించుకున్న విశాల్ కు గత కొన్నేళ్లుగా కనీస హిట్ లేకుండా పోయింది. 2018లో అభిమన్యుడు రూపంలో హిట్ దక్కినప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పందెం కోడి 2 బిసి సెంటర్స్ లో పర్వాలేదనిపిస్తే ఓవరాల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. టెంపర్ రీమేక్ ని అయోగ్య పేరుతో తిరిగి డబ్బింగ్ చేస్తే కనీసం ఎవరూ పట్టించుకోనూ లేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ ఫ్లాప్ కాగా చక్ర అసలు రిలీజయిందన్న విషయం కూడా ఎవరికీ గుర్తు లేనంత దారుణంగా ఫెయిలయ్యింది. సామాన్యుడు సంగతి సరేసరి
అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ రేపు విడుదల కాబోతున్న లాఠీ మీదే ఉన్నాయి. దీని కోసం విశాల్ చాలా కష్టపడ్డాడు. సుదీర్ఘంగా నడిచే క్లైమాక్స్ లో ఒంటి కన్నుతో నటించి రిస్క్ తీసుకున్నాడు. రిలీజ్ ఆలస్యమైనా ఓపిగ్గా వేచి చూసి డేట్ ని లాక్ చేసుకున్నాడు. ఎంతటి నేరస్తుడితో అయినా తన లాఠీ ట్రీట్ మెంట్ తో నిజాలు కక్కిస్తాడని పేరున్న ఓ పోలీస్ కు నగరాన్ని వణికించే ఒక పెద్ద ముఠా నుంచి ప్రమాదం ఎదురవుతుంది. వాళ్ళు వందల్లో తాను ఒక్కడినే ఒక పెద్ద భవంతిలో ఎదిరించే పరిస్థితి వస్తుంది. లైన్ పరంగా డిఫరెంట్ గా అనిపిస్తున్న లాఠీ టైటిల్ ఒకప్పుడు గుణశేఖర్ తన డెబ్యూ మూవీకి పెట్టుకున్నది. ప్రశాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ అది
అయితే విశాల్ కు పోటీ లేకుండా అయితే లేదు. నిఖిల్ 18 పేజెస్ ఒక రోజు ఆలస్యంగా ఎల్లుండి వస్తోంది. రేపు నయనతార కనెక్ట్ ని యువి సంస్థ థియేటర్లకు తెస్తోంది. రవితేజ ధమాకా శుక్రవారం సందడి చేయబోతున్నాడు. వీటి మధ్య లాఠీ నెగ్గాల్సి ఉంటుంది. కంటెంట్ ఉంటే స్ట్రెయిటా డబ్బింగా అనేది జనం పట్టించుకోవడం లేదు కాబట్టి సినిమాలో మ్యాటర్ ఎంతనేది చూడాలి. అవతార్ 2 రెండో వారం ఎంటర్ కాకుండానే చాలా చోట్ల నెమ్మదించింది. మొదటి మూడు రోజులు కనిపించిన ఊపులో ఇప్పుడు యాభై శాతం కూడా లేదు. వీకెండ్ పికప్ తప్ప మిగిలిన రోజుల్లో అవతార్ నెగ్గడం కష్టంగా ఉంది. మరి లాఠీ తన దెబ్బ ఎలా రుచి చూపిస్తుందో చూడాలి