Vijayakanth: పాపం విజయకాంత్.. నాలుగేళ్లుగా కొడుకు పెళ్లి వాయిదా.. చివరకు

కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందేే. పాపం కుమారుడి పెళ్లి చూడకుండానే ఆయన చనిపోయారు. ఆ వివరాలు..

కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందేే. పాపం కుమారుడి పెళ్లి చూడకుండానే ఆయన చనిపోయారు. ఆ వివరాలు..

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ రెండు రోజుల క్రితం అనగా.. డిసెంబర్‌ 28న తుది శ్వాస విడిచారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో విజయకాంత్ పార్థివదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు.. వేల మంది అభిమానులు.. విజయకాంత్ కడసారి చూపు కోసం తరలి వచ్చారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే.. కొన్నాళ్ల క్రితం ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన వాలంటీర్లను మాత్రమే కలుస్తున్నారు.

కుమారుడి పెళ్లి చూడకుండానే..

విజయకాంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు విజయప్రభాకరన్, షణ్ముఘపాండియన్. అయితే చిన్న కుమారుడు షణ్ముఘ పాండియన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నారు. అతను తన తండ్రి విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) బాధ్యతలు చూసుకుంటున్నాడు.

ఇలా ఉండగా.. నాలుగేళ్ల క్రితం అనగా.. 2019, డిసెంబర్ లో పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వివాహం నిశ్చయం అయ్యింది. కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనాతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అనారోగ్య కారణాల వల్ల విజయకాంత్ నిశ్చితార్థ వేడుకకు రాలేకపోయారు.

నిశ్చితార్థం జరిగినా పెళ్లికి బ్రేక్..

అయితే విజయప్రభాకరన్ నిశ్చితార్థం జరిగి ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో.. వీరి వివాహ విషయంలో అనేక ఊహాగానాలు జోరందుకున్నాయి. నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. కానీ విజయకాంత్‌ సన్నిహితులు చెబుతున్న మాత్రం వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలు కావడంతో..  వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు.

కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్‌ ఆశించారట. కానీ ఆ సమయంలో మోదీ బిజీగా ఉండటం వల్ల ఆ పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారని.. అలా వాయిదా పడిందని చెప్పుకొచ్చారు

దీంతో 2022లో కూడా ఆ పెళ్లికి మరోసారి బ్రేకులు పడ్డాయి. విజయప్రకాకరన్ వివాహానికి హాజరు అయ్యేందుకు మోదీ సమయం ఇచ్చినా.. నుంచి విజయకాంత్‌ ఆరోగ్యం మరింత క్షణించడంతో.. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. దాంతో మరోసారి వివాహం వాయిదా పడింది. ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్‌ ముందునుంచి ఆశించేవారట. కానీ చివరకు కొడుకు పెళ్లి చూడకుండానే ఆయన కన్ను మూశారు. ఈ విషయం తెలిసిన వారు ఇప్పుడు మోదీ వచ్చినా లాభం లేదు కదా అంటున్నారు.

Show comments