iDreamPost
android-app
ios-app

శివాజీ – మహేష్ బాబు కలిసి నటించిన సినిమా.. ఏదో తెలుసా?

  • Author ajaykrishna Updated - 05:28 PM, Thu - 19 October 23
  • Author ajaykrishna Updated - 05:28 PM, Thu - 19 October 23
శివాజీ – మహేష్ బాబు కలిసి నటించిన సినిమా.. ఏదో తెలుసా?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఫ్యాన్స్ అసలు ఎక్స్ పెక్ట్ చేయలేరు. ఇప్పుడంటే ఎవరు ఏం సినిమా.. ఎవరితో చేస్తున్నారు.. లాంటి విషయాలు ఈజీగా తెలిసి పోతున్నాయి. కానీ.. సోషల్ మీడియా నెట్ వర్క్ లేనప్పుడు ఎన్నో సూపర్ కాంబినేషన్స్ తెరపైకి వచ్చేశాయి. బిగ్ బాస్ 7వ సీజన్ లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణిస్తున్న నటుడు శివాజీ. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు హీరోగా చేసి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతోమంది హీరోలకు శివాజీ వాయిస్ ఇచ్చి ఇండస్ట్రీలో లాంచ్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన శివాజీ.. తనదైన ఆటతో.. మైండ్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ.. ఈ మధ్య ఓ వెబ్ సిరీస్ ఓకే చేశారు. కానీ.. బిగ్ బాస్ వల్ల షూటింగ్స్ కి బ్రేక్ పెట్టేసి.. హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. అయితే.. హౌస్ లో ముక్కుసూటిగా మాట్లాడే శివాజీ.. ఇండస్ట్రీలోకి ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించి.. ఆ తర్వాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత హీరోగా మారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు. కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నవి కూడా చేశాడు. కాగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలామంది హీరోలకు వాయిస్ అందించి.. అన్ని రకాలుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే.. సహాయ నటుడిగా శివాజీ.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబుతో ఓ సినిమా చేశాడని మీకు తెలుసా.. ఆ సినిమాలో మహేష్ బాబుకు ఫ్రెండ్ గా శివాజీ కనిపించాడు. ఏ సినిమా అంటే.. మహేష్ బాబుతో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన యువరాజు. ఈ సినిమాలో మహేష్ బాబుకు ఫ్రెండ్ గా శివాజీ నటించి మెప్పించాడు. మరి శివాజీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş