iDreamPost
android-app
ios-app

Actor Siddharth : సైనా మీద సిద్దార్ద్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్

Actor Siddharth : సైనా మీద సిద్దార్ద్ వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన హీరో సిద్ధార్థ ఆ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రధాని మోడీ అన్నా బీజేపీ అన్నా ఎందుకో తెలియదు కానీ ఆయన తన వ్యతిరేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఇప్పుడు ఆయన సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ మీద చేసిన కామెంట్స్ కొత్త వివాదాన్ని సృష్టించాయి. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ కలెక్షన్ల గురించి మాట్లాడి అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు సిద్ధార్థ్. ఆ సంగతి పక్కన పెడితే ఆయన తాజాగా సైనా నెహ్వాల్ మీద చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.

అసలు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీ పంజాబ్ టూర్ లో ఉండగా ఆయన కాన్వాయ్ ఇరవై నిమిషాలపాటు ఒక ఫ్లైఓవర్ మీద చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని ఆ రూట్లో వస్తున్నారని తెలుసుకున్న కొందరు నిరసనకారులు రోడ్డుమీద బైఠాయించడంతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాన మంత్రి మోడీ కాన్వాయ్ అక్కడ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ వ్యవహారం జరిగి వారం రోజులు గడుస్తున్న తర్వాత కూడా ఎవరో ఒకరు ఈ విషయం మీద స్పందిస్తూనే ఉన్నాడు. తాజాగా సైనా నెహ్వాల్ మోడీ కాన్వాయ్ ఆగిపోవడం భద్రత వైఫల్యమే అని చెబుతూ ఆయనకు మద్దతుగా ట్వీట్ చేసింది. అయితే ఆమెకు తెలియక చేసిందో, మరి పొరపాటున చేసిందో కానీ భద్రతా వైఫల్యం అని వాడాల్సిన చోట ప్రధాని మీదే దాడి జరిగితే ఆ దేశంలో భద్రత ఉందని ఎలా చెప్పగలం? మోడీ మీద జరిగిన ఈ దుర్మార్గమైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేసింది.

ఈ విషయం మీద స్పందిస్తూ చిన్న కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్… దేవుడా… భారతదేశాన్ని రక్షించేవాళ్లు కూడా ఉన్నారు… షేమ్ ఆన్ యూ రిహానా… ” అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు సిద్ధార్థ్. హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లకు నెటిజన్ల నుంచి తీవ్రమైన స్పందన వస్తోంది. సిద్ధార్థ మీద ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్​ చేయాలని ట్విట్టర్​ ఇండియాకు లేఖ రాసింది. అంతేకాదు సైనా నెహ్వాల్​పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ డిమాండ్ చేశారు. కానీ సిద్ధార్థ్ మాత్రం తాను రాసింది ఇది అంటూ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. “మీ బుర్రలలో బూతు ఉంది. నేను డబుల్ మీనింగ్ తో రాయలేదు. సైనా నెహ్వాల్ షటిల్ ఆడుతుంది. ఆమె షటిల్ కాక్ తోనే ఛాంపియన్ అయింది కదా దాన్ని నేను సెటైర్ గా వేశాను తప్ప మీరు అనుకునే బూతు అర్థం కాద,”ని సిద్ధార్థ్ వాదిస్తున్నాడు.

Also Read : Rowdy Boys : భారీ హంగామాతో కొత్త హీరో ఎంట్రీ

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabet