iDreamPost
android-app
ios-app

నా మృతదేహాన్ని సింహాలకు ఆహరంగా వేయండి – బ్రిటన్ నటుడి వింత కోరిక

నా మృతదేహాన్ని సింహాలకు ఆహరంగా వేయండి – బ్రిటన్ నటుడి వింత కోరిక

ప్రపంచం నుండి మనం అన్నీ తీసుకుంటున్నాం తప్ప ఏమీ వెనక్కి ఇవ్వడం లేదు. అందుకే ప్రకృతికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అందుకే తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని లండన్ జూలో ఉన్న సింహాలకు ఆహరంగా వేయాలని బ్రిటన్ నటుడు తనలో దాగిన వింత కోరికను బయటపెట్టాడు.

బ్రిటన్ హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీస్‌ ఓ ఇంటర్వ్యూలో మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలని కోరుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని లండన్ జూలో ఉన్న సింహాలకు ఆహారంగా వేయాలని సమాధానం ఇచ్చారు. ప్రపంచం నుండి అన్నీ తీసుకుంటున్నామని అడవులను నరికేస్తున్నామని, జంతువులను తినేస్తున్నామని ప్రకృతిని నాశనం చేస్తున్నామని అందుకే తన మృతదేహాన్ని సింహాలకు ఆహరంగా వేయాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన మృతదేహాన్ని సింహాలు తింటున్నపుడు సందర్శకుల హావభావాలు ఎలా ఉంటాయో గమనించాలని ఉందని తెలిపాడు.

కాగా రికీ జెర్వీస్‌ మాటలకు స్పందించిన లండన్ జూ అధికారులు తాము సింహాలకు ఆహారంగా నటుడి మృతదేహాన్ని వేయబోమని అందుకు బదులుగా సింహాల జూ కు విరాళాలు ప్రకటిస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. రికీని తినడానికి జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చు జూ నిర్వహణ అధికారి వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం జూ నిర్వహణ భారంగా మారిందని, ఎవరైనా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటే విరాళల రూపంలో ఇవ్వాలని వచ్చే విరాళాలతో జూలోని సింహాలకు ఆహారం అందిస్తామని జూ నిర్వహణ అధికారి తెలపడం గమనార్హం.