iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబినేషన్.. అనుదీప్ తో మాస్ మహారాజా సినిమా!

  • Author Soma Sekhar Published - 05:32 PM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 05:32 PM, Mon - 10 July 23
క్రేజీ కాంబినేషన్.. అనుదీప్ తో మాస్ మహారాజా సినిమా!

ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఎన్నో హిట్ కాంబోలు ఉన్నాయి. కానీ కొన్ని క్రేజీ కాంబినేషన్లు కలిస్తే.. ఆ కిక్కే వేరప్ప అన్నట్లుగా ఉంటుంది. తాజాగా అలాంటి కాంబినేషనే టాలీవుడ్ లో త్వరలో రాబోతోందని తెలుస్తోంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం షేక్ చేసిన డైరెక్టర్ తో జతకట్టబోతున్నాడు హీరో రవితేజ. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మాస్ మహారాజా రవితేజ.. రీసెంట్ గా ‘ధమాక’ సినిమాతో హిట్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు మాస్ మహారాజా. ప్రస్తుతం టైగార్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న రవితేజ.. త్వరలోనే మరికొన్ని మూవీలను పట్టాలపైకి ఎక్కించనున్నాడు. అయితే ఈ సినిమాల్లో ఓ క్రేజీ కాంబినేషనల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబినేషన్ పేరు వింటేనే చాలు మీరు ఆశ్చర్యానికి గురికావడం పక్కా. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ తో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా చెన్నై సోయగం త్రిష, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత రవితేజ-త్రిషలు కలిసి నటించబోతున్నారు.

ఈ జోడీ గతంలో కృష్ణ సినిమాలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. తాజాగా మరోసారి తమ కెమిస్ట్రీతో అభిమానులను అలరించనున్నారు. కేవీ అనుదీప్ తో రవితేజ సినిమా అనగానే మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనుదీప్ కామెడీకి రవితేజ టైమింగ్ తోడైతే.. థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. రవితేజ ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలను వరుసగా పట్టాలెక్కించే పనిలో పడ్డారు. డైరెక్టర్ హారీష్ శంకర్ తో ఓ సినిమాతో పాటు.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాను లైన్ లో పెట్టారు. అయితే ఈ కాంబినేషన్లలో గతంలో సినిమాలు చేశారు రవితేజ. కానీ అనుదీప్ తో సినిమా అనగానే ఇండస్ట్రీ మెుత్తం ఆశ్చర్యంలో మునిగింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom