iDreamPost
android-app
ios-app

రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవు

  • Published Nov 01, 2023 | 10:23 AM Updated Updated Nov 01, 2023 | 10:23 AM

ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దరఖాస్తు చేస్తుంటారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సామాన్యుల నుంచి సీఎం వరకు అందరికీ రూల్స్ వర్తిస్తాయి.

ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దరఖాస్తు చేస్తుంటారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సామాన్యుల నుంచి సీఎం వరకు అందరికీ రూల్స్ వర్తిస్తాయి.

  • Published Nov 01, 2023 | 10:23 AMUpdated Nov 01, 2023 | 10:23 AM
రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవు

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు గత నెల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నకారణంగా పార్టీ అభ్యర్థులు పక్కాగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని.. ఒకవేళ వాటిని పట్టించుకోకుండా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డిసెంబర్ 5 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ ఎన్నికల కోడ్ పాటించాల్సి ఉంటుంది. లేదంటా వారిపై చర్యలు తప్పవంటుంది ఈసీ. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. కొత్త ఓటర్ నమోదు గడువు ముగిసింది, ఎవరైనా కావాలని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సామాన్యుల నుంచి సీఎం వరకు అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఎవరైనా రూ.50 వేలకు మంచి డబ్బును తీసుకువెళ్తే దానికి సంబంధించిన సరైన పత్రాలు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. బంగారం, వెండి, మద్యం ఇతర వస్తువులు ఎక్కడికైనా తరలిస్తే.. వాటికి సంబంధించిన ప్రతి డాక్యూమెంట్ పోలీసులకు చూపించాల్సి ఉంటుంది.. ఈ నిబంధన ప్రభుత్వం, రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పార్టీగానే పరిగణలోకి వస్తుంది. ప్ర ప్రభుత్వ ధనంతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడానికి వీలు లేదు.. ఒకవేళ అలా చేస్తే వారిపై చర్యలు ఉంటాయని అంటున్నారు.  ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రచారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేయాలి.  ఎన్నికల కోడ్ లో భాగంగా రాజకీయ పార్టీ నేతలు పార్టీల పాలసీలు, గత రికార్డులు, వారు చేస్తున్న కార్యక్రమాలపై దుష్ప్రచారం చేయకూడదు.

నోటిఫికేషన్ తేదీ నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నియమావళిని పాటించాల్సి ఉంటుంది. ఇక ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే ప్రదేశంతో పాటు సమయానికి సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీకి సంబంధించిన ఏ ఇతర సభ్యులైనా.. ఆలయాలు, మసీదు, చర్చీ లాంటి మతపరమైన ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించకూడదు. తమ ప్రసంగాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులపై వ్యక్తిగత జీవితం, కుటుంబంపై ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయకూడదు. ఇక ప్రచారం చేసే అభ్యర్థులు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంపూ పూర్తి నిషేదం. ఎన్నికల సందర్భంగా మీటింగ్ స్థలాలు, హెలిప్యాడ్లు, గవర్నమెంట్ గెస్ట్ హౌజులు లాంటివి అభ్యర్థులు ఒక ఒప్పందం చేసుకొని సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.. వీటిపై ఎలాంటి రగడ చేసినా చర్యలు తప్పవు అంటున్నారు ఈసీ అధికారులు.

ఇక పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హూర్డింగులు, జెండాలు ఏవైనా ఏర్పాటు చేయాలనుకుంటే.. ఆ స్థలానికి సంబంధించిన యజమాని పరిమిషన్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. గోడలు, ఇళ్ల, స్థలాల యజమానుల అనుమతి లేకుండా పెయింట్ చేయడం, పోస్టర్లు అంటించడం లాంటివి చేయకూడదు. సాధారణంగా ప్రచార సమయంలో వాహనాలపై లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుంటారు. పార్టీకి సంబంధించిన పాటలతో హూరెత్తిస్తుంటారు. అయితే లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్నికల అధికారి పరిమిషన్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. తాము నిర్వహించే సభల్లో ఎవరైనా ప్రత్యర్థులు ఆటకం కలిగిస్తే.. పోలీసులు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రచారాల్లో పాల్గొనే అభ్యర్థులు, కార్యకర్తలు బ్యాడ్జీలు, ఐడెంటీ కార్డులు తప్పకుండా కలిగి ఉండాలి. ప్రచార సమయంలో అభ్యర్థలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంటారు.. ఆ సమయంలో ఓటరు స్లీప్ లు ఇస్తుంటారు. అయితే వాటిపై సింబల్ గానీ, పార్టీ గుర్తు కాని ఉండకూడదు. పైన పేర్కొన్న నియమాలు ఎవరైనా పాటించని యెడల ఏ పార్టీ నేతలైనా సరే ఎన్నికల కమీషన్ పరిశీలకులు, జనల్, రిటర్నింగ్, సెక్టర్ మెజిస్ట్రేట్, సీఈవో, ఈసీఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.