ఓ కేసును ఎలా దర్యాప్తు చేయాలి? ఎవరి వద్ద సమాచారం తీసుకోవాలి? ఎప్పుడు ఛార్జిషీట్ వేయాలి అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ కు ఎవరో చెప్పక్కర్లేదు. వారికీ పాఠాలు నేర్పించాల్సిన అవసరం అంత కంటే లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కు ఇప్పుడు నేను సమాచారం ఇస్తా.. నేను దర్యాప్తుకు అవసరం అయ్యే విషయాలు చెబుతాను అంటూ కొత్త కొత్త ఆఫర్లు వస్తున్నాయి. చంద్రబాబుకు అనుంగు అనుచరుడుగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ చక్కదిద్ది, అవినీతి ఆరోపణల్లో సస్పెన్షన్ ఎదుర్కొంటున్న పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ బంపర్ ఆఫర్ ను సీబీఐకు ఇచ్చారు.
సీబీఐకు ఎవరి వద్ద ఎలాంటి సమాచారం తీసుకోవాలో, ఎలా కేసును దర్యాప్తు పూర్తి అవగాహన ఉంటుంది. చార్జిషీటు వేయాల్సిన విషయంలో గానీ అరెస్టుల అంశంలో గాని వారికి ప్రత్యేక నిబంధనలు పాటిస్తారు. అయితే సీబీఐ అడ్డుపెట్టుకుని కూడా కొందరు అధికారులు అతి చేస్తారు. అది వేరే విషయం. ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలో దీన్ని పక్కదోవ పట్టించాలని, కొత్త అంశాలను తెరపైకి తెచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ లో అయోమయం సృష్టించాలనే కుట్రలో భాగమే ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు సమాచారం ఇస్తానని స్వచ్ఛందంగా చెప్పడంలో భాగం.
తెలుగుదేశం పార్టీ నానాటికీ వెనుక పడుతున్న సమయంలో అధికార పార్టీ మీద, నాయకుల మీద ఎలాగైనా బురద చల్లి దాని ద్వారా లబ్ధి పొందాలని భావిస్తూ ఉన్న టిడిపి కుట్రలో భాగమే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాగం అనేది ప్రజలకే కాదు సిబిఐకి తెలిసే ఆయన మాటలను పట్టించుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఏవి వెంకటేశ్వరరావు నోటి నుంచి వచ్చేది అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందన్న విషయం సీబీఐకు తెలిసే, దర్యాప్తు పక్కదారి పడుతోందని అర్థం అయ్యే ఆయన సమాచారాన్ని సిబిఐ తీసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు.
Also Read : ట్విట్టర్ కలుపుతుందా … ఆ ఇద్దరినీ !
వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఏమైనా చెప్పదలుచుకున్న అప్పట్లోనే చెప్పి ఉండాలి. అంతేకాకుండా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు ఆయన సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తే వ్యవహారం సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లేది కాదు. అయితే అప్పట్లో కావాలనే ఈ విషయాలపై దృష్టి పెట్టని ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు కావాలని నోరు విప్పడానికి సిద్ధం అవుతున్నారు అన్నది సుస్పష్టం.
తన వద్ద ఎలాంటి సమాచారం ఉందో దానిని డైరెక్టుగా సిబిఐ పంపితే సరిపోయేది. వారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చిన సమాచారంలో ఎంతమేర తీసుకోవాలో అంతమేర తీసుకొని కేసు దర్యాప్తు ఉపయోగించుకునేవారు. అలా కాకుండా ఏబీ వెంకటేశ్వరరావు ను ప్రత్యేకంగా పిలిచి ఈ కేసులో విచారించాల్సిన అవసరం ఏమీ సీబీఐకి లేదు. తాను సమాచారం ఇస్తానన్న సిబిఐ తీసుకోవడం లేదని మీడియా ముఖంగా చెప్పాల్సిన అవసరం వెంటకటేశ్వర రావు కు ఏమిటి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కక్ష పూరితంగా వ్యవహరించడం లో భాగంగానే, అలాగే టిడిపి కనుసన్నల్లో రాజకీయం నడపాలని కుట్ర కోణంలోనే ఏబీ వెంకటేశ్వరరావు కొత్త డ్రామా మొదలు పెట్టారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ఐపీఎస్ అధికారి మీద దేశ భద్రతకు సంబంధించిన నేరారోపణలు వచ్చిన సమయంలో ఆయనను సస్పెండ్ చేయడం ప్రభుత్వ విధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే చేసింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో, మళ్లీ ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ లోకి వస్తే అది ప్రభావితం అయ్యే అవకాశం ఉండడంతో సస్పెన్షన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. దీనిలో ఎక్కడ రాజకీయం లేదు.
ఇప్పుడు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని, సస్పెన్షన్ మీద న్యాయపోరాటం వరకు వెళ్లిన ఏవి వెంకటేశ్వరరావు అక్కడ నుంచి కూడా సరైన మద్దతు లేకపోవడంతో ఏపీ ప్రభుత్వాన్ని, పాలకులను, వైఎస్ కుటుంబాన్ని ఇరుకున పెట్టే కుట్ర ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ కేసులో వెంకటేశ్వరరావు మాటను సీబీఐ ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటుంది.. దానికి ఎంత మేర కౌంటర్ వేస్తుంది అన్నది వేచి చూడాలి. సిబిఐ స్పందించకపోతే దీనికి రాజకీయ రంగు పులిమి టిడిపి లబ్ధి పొందడానికి అన్ని రకాల ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది.
Also Read : నిఘా వైఫల్యాన్ని బయటపెట్టిన ఏబీవీ లేఖ.. ఆధారాలు ఉంటే రెండేళ్లు ఏం చేస్తున్నారు..?