iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ మల్టీస్టారర్!

  • Published Dec 30, 2022 | 7:15 PM Updated Updated Dec 30, 2022 | 7:15 PM
ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ మల్టీస్టారర్!

జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ప్రకటించి ఏడు నెలలు దాటినా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే లేవు గానీ.. అప్పుడే ఎన్టీఆర్ తదుపరి సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించనున్నాడట. అదే నిజమైతే పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఎన్టీఆర్, ఆమిర్ ఖాన్ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాక్టింగ్ పవర్ హౌస్ లు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఎన్టీఆర్31 కోసం ప్రశాంత్ నీల్ నిజంగానే ఆమిర్ ఖాన్ ని రంగంలోకి దింపితే దానిని మించిన సర్ ప్రైజ్ ఉండదు. ఒకవేళ ఆమిర్ ఖాన్ విలన్ గా చేస్తే, ఎన్టీఆర్ వర్సెస్ ఆమిర్ ఫైట్ చూడడానికి అందరూ ఎంతో ఆసక్తి చూపుతారు. అలా కాకుండా ఇద్దరు హీరోలుగా మల్టీస్టారర్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా మల్టీస్టారరే. అందులో రామ్ చరణ్ తో స్క్రీన్ పంచుకున్నాడు ఎన్టీఆర్. దానివల్ల సక్సెస్, క్రెడిట్ అన్నీ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కూడా ఇది మా సినిమా అని చెప్పుకోకుండా అయిపోయింది. అందుకే ఎన్టీఆర్ మల్టీస్టారర్లకు దూరంగా ఉంటే మంచిదన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. ఆమిర్ విలన్ గా నటిస్తే ఓకే కానీ మల్టీస్టారర్ అయితే మాత్రం సక్సెస్ క్రెడిట్ రాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişholiganbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş