iDreamPost
android-app
ios-app

బోర్ కొట్టి 3.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు..

  • Published Jun 06, 2022 | 7:30 PM Updated Updated Jun 06, 2022 | 7:30 PM
బోర్ కొట్టి 3.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు..

ప్రస్తుతం జాబ్స్ దొరికితేనే చాలు అనుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. బయట చాలా మంది ఉద్యోగాలు దొరక్క అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం చేసే ఉద్యోగంలో కొత్తదనం లేదని, బోర్ కొట్టిందని ఏకంగా నెట్ ఫ్లిక్స్ లో సంవత్సరానికి 3.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. దీంతో ఈ విషయం తెలిసి అటు కంపెనీ వాళ్ళు, బయట జనాలు షాక్ అవుతున్నారు.

మైఖైల్‌ లిన్‌ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో చేరాడు. అంతకు ముందు అమెజాన్‌లో పెద్ద స్థాయిలో పని చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన తర్వాత అక్కడ పని విధానం, సంస్థ ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా చేయడంలో లిన్‌కి మంచి కిక్ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన కొత్తలో బాగా ఉత్సాహంగా పని చేసాడు లిన్‌. నెట్‌ఫ్లిక్స్‌లో తన టీంతో కలిసి బాగా పని చేయడంతో అతని సంవత్సర జీతం రూ. 3.5 కోట్లకు చేరుకుంది.

ఇక కరోనా సమయంలో ప్రపంచమంతటా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఓటీటీలకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయంలో మరింత మందికి నెట్‌ఫ్లిక్స్‌ చేరవేసేలా లిన్‌ మరియు అతని టీం కష్టపడ్డారు. ఇక కరోనా ముగిశాక మళ్ళీ అంతగా కొత్త వర్క్ ఏమి లేకపోవడం, రోజు వారి పనులే ఉండటంతో ఉద్యోగం బోర్ కొట్టేసింది లిన్ కి. రోజూ తిని, పని చేసి, పడుకోవడం ఇదేనా లైఫ్ లో కొత్తదనం ఏం లేదు అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు.

దీంతో 3.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడంతో అంతా షాక్ అయి అతన్ని తిట్టేవాళ్ళు ఉన్నారు, కొత్తదనం కోసం ఇంకేదైనా చేయి అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతే కాకుండా సేఫ్ సైడ్ ఇంకో జాబ్ కూడా చూసుకోకుండా రాజీనామా చేయడం విశేషం. లిన్ ని అడిగితే ఏదైనా కొత్త కంపెనీ పెడతాను అని అంటున్నాడు. మరి కొత్తదనం కోసం ఏం చేస్తాడో చూడాలి.