iDreamPost
android-app
ios-app

కూలీ పనులు చేస్తూ ఎస్సై ఉద్యోగం సాధించిన యువకుడు!

కూలీ పనులు చేస్తూ ఎస్సై ఉద్యోగం సాధించిన యువకుడు!

లక్ష్యం, పట్టుదల, కృషి ఉన్న వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే.. విజయం మన ముగింటకు వస్తుంది. అలా జీవితంలో ఎన్నో సమస్యలను  ధైర్యంగా ఎదుర్కొన్ని.. తమ లక్ష్యం వైపు అడుగులు వేసి.. చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యంపై గురి ఉన్నవారికి పేదరికం, ఆర్థిక సమస్యలు వంటి వాటికి భయపడక శ్రమించి విజయం సాధిస్తారు. అలా ఎందరో కష్టాలను ఎదుర్కొని జీవితంలో విజేతలుగా నిలిచారు. తాజాగా వారి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బొంత ప్రవీణ్  చేరాడు. ఒకప్పుడు కూలీగా ఉన్న ఆ యువకుడు నేడు.. ఎస్సైగా మారాడు. మరి.. అతడి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉమ్మడి నల్లగొండ గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన పూర్తి ..బొంత పాపయ్య, ఆండాళ్లు భార్యాభర్తలు. వీరికి బొంత ప్రవీణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు చిన్నతనం నుంచి పోలీస్ అవ్వాలని కలలు కనేవాడు.  ఈక్రమంలోనే ప్రాథమిక, ఉన్నత విద్యలో బాగా రాణించాడు.  ఇలానే ఇంజినీరింగ్ లో చేరి.. కష్టపడి చదివాడు. ఈక్రమంలో 2021 సంవత్సరంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. అలానే తరచూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయ పడేవాడు. కూలీ పనులు చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుండే వాడు.

ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై పరీక్షలు రాశాడు.  ఎస్పీఎఫ్ ఎస్సైగా  ప్రవీణ్ ఎంపికయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఎస్సై ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.  ఎస్సై ఫలితాలు వచ్చే రోజు కూడా ప్రవీణ్..తన తండ్రితో కలిసి గుండాల మండల కేంద్రంలో కూలీ పనులు చేశాడు.  ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఇంకా ఉన్నత స్థాయిలో రాణించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రవీణ్ ఎస్సైగా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎస్సై ఉద్యోగానికి ప్రవీణ్ మేనత్త కొడుకు  ఆలకుంట్ల నరేష్ కూడా ఎంపికయ్యాడు. మరి.. నాడు కూలీగా ఉన్న యువకుడు కష్టపడి నేడు ఎస్సైగా మారాడు. మరి.. ప్రవీణ్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇమామ్, మౌజంలకు గుడ్ న్యూస్! మరో 7 వేల మందికి గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet