iDreamPost
android-app
ios-app

రాధే శ్యామ్ లో కదిలించే మలుపు ?

  • Published Jun 30, 2021 | 7:14 AM Updated Updated Jun 30, 2021 | 7:14 AM
  • Published Jun 30, 2021 | 7:14 AMUpdated Jun 30, 2021 | 7:14 AM
రాధే శ్యామ్ లో కదిలించే మలుపు ?

కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల ఆగుతూ సాగుతూ జరిగిన రాధే శ్యామ్ షూటింగ్ ఎట్టకేలకు ఫైనల్ స్టేజి కి వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చివరి పాట చిత్రీకరణ జరుపుతున్నారు. దీంతో పాటు మరికొన్ని సీన్లు కొంత ప్యాచ్ వర్క్ మినహా మొత్తం ఫినిష్ అయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు. విడుదల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా థియేటర్ తో పాటు ఇతర హక్కులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు మాత్రం పూర్తి చేసేశారు. రిలీజ్ కు ముందే భారీ లాభాలు యువి సంస్థ కళ్ళజూడటం ఖాయమైపోయింది. ఇక తాజాగా లీకైన లేటెస్ట్ అప్ డేట్ షాక్ ఇచ్చేలా ఉంది.

రాధే శ్యామ్ క్లైమాక్స్ కి ట్రాజెడీ టచ్ ఇచ్చారని దాని సారాంశం. పూజా హెగ్డే పాత్ర చివర్లో చనిపోతుందని అయితే ఈ ఫీలింగ్ నెగటివ్ గా కాకుండా చాలా ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా దర్శకుడు రాధాకృష్ణ ప్రెజెంట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే దీనికి కారణం ఏంటి రాధే శ్యామ్ అంటే ఒక జన్మా లేక రెండు రెండు జన్మల కథలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఈ మాత్రం సంగతి తెలియడమే గొప్ప. అధిక భాగం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే రాధే శ్యామ్ లో ప్రభాస్ పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ గత కొన్నేళ్లలో ఏ సినిమాలోనూ చూడని రేంజ్ లో తెరమీద కనిపిస్తుందని వినికిడి.

ఇది నిజమో కాదో రిలీజయ్యాక క్లారిటీ వస్తుంది కానీ ప్రమోషన్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సాహో తర్వాత ఎంత స్పీడ్ పెంచుదామనుకున్నా ప్రభాస్ కు గ్యాపులు తప్పడం లేదు. రాధే శ్యామ్ సుమారు 400 కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిస్తే తప్ప రాధే శ్యామ్ ని పెద్ద తెరపై చూడటం అసాధ్యం. అది సెప్టెంబరా లేక అంత కన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ గ్రాండియర్ లో భాగ్యశ్రీ, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio