భారతదేశం మేధావులకు నిలయం. ఇక్కడ కొత్త కొత్త ఆవిష్కరణలకు కొదవే లేదు. మారుమూల పల్లెల నుంచి మొదలు పట్నం దాకా జుగాడు చేసే అద్భుతాలు అందరినీ ఆకట్టుకుంటు కోవడమే కాక ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వారు చేసే చిత్ర విచిత్ర పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ఇక ఆ వీడియోలో చూసినట్లైతే… ఒక వ్యక్తి తన మంచాన్ని నాలుగు చక్రాల మోటర్ వాహనంగా మార్చాడు. సోషల్ మీడియాలో మంచం రూపంలో ఉన్న బైక్ దర్శనమిచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అయితే ఈ జుగాడు కుర్రాడి బైక్ పై మాత్రం ఏకంగా తొమ్మిది మంది కూర్చున్నారంట. ఈ వాహనం బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆగింది. మంచం రూపంలో ఉన్న ఈ బైక్ ను చూసిన తోటి వాహన దారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాక ఆ వాహనాన్ని సంబంధించిన ఫోటోలను తమ ఫోన్లో బంధించారు. ఇక ఈ వాహనాన్ని తయారు చేయడానికి మంచం, సైకిల్ చక్రాలు, కారు స్టీరింగ్‌ను ఉపయోగించారు.
మంచానికి చక్రాలు అమర్చారు. మరొక వైపు హ్యాండిల్, రేస్ మొదలైనవి సెట్ చేశారు. అలానే ఈ మంచం బైక్ కు మోటారు కూడా బిగించి ఉంది. ఈ వాహనం సగటున గంటకు 50-60 కి.మీల వేగాన్ని ఇస్తుందని, ఇందులో నలుగురైదుగురు మనుషులు కూర్చుని హాయిగా ప్రయాణించవచ్చునని తయారీదారుడు తెలిపారు. ఈ మంత్రముగ్ధమైన వస్తువును తయారు చేసిన వ్యక్తిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇది బైక్ కాదు చిన్నపాటి కారును తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వింత వాహనం వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈ వెరైటీ వాహనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.