iDreamPost
android-app
ios-app

తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఆర్ఆర్ఆర్, జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న

  • Published May 10, 2022 | 6:32 PM Updated Updated May 10, 2022 | 6:32 PM
  • Published May 10, 2022 | 6:32 PMUpdated May 10, 2022 | 6:32 PM
తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఆర్ఆర్ఆర్, జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశ్న

ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా పలు చోట్ల ఆడుతూ రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెలపైనే అవుతున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ మానియా తగ్గట్లేదు. తాజాగా తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్(Telangana Inter Exams) పేపర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌పై విద్యార్థులకు ప్రశ్న వేశారు.

ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్(English) క్వశ్చన్ పేపర్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని కొమరంభీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) గురించి ప్రశ్న అడిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరంభీం పాత్రలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌తో మీరు ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ అయి ఇంటర్వ్యూ చేస్తే కింద ఉన్న పలు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎలా అడుగుతారు? ఎలా సమాధానమిస్తారు? అంటూ ఆ ప్రశ్నని అడిగారు.

దీంతో ఈ క్వశ్చన్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ, ట్విట్టర్లో ప్రశ్నపత్రాన్ని ట్వీట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet